వర్ధిల్లెదము మన దేవుని
మందిరమందు నాటబడినవారమై
నీతిమంతులమై మొవ్వు వేయుదము
యేసురక్తములోనే జయము మనకు జయమే
స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే
యెహోవా మందిర ఆవరణములో
ఎన్నోన్నె మేళ్ళు గలవు
ఆయన సన్నిధిలోనే నిలిచి
అనుభవింతుము ప్రతిమేలును
నీ మందిరమై నేనుండగా - నాయందుండి నడిపించవా
నీవు తోడుండగా మాకు దిగులుండునా
వెంబడిస్తాము నిను యేసువా
నీవు కోరేటి దేవాలయం - మాదు దేహంబెగా నిశ్చయం
నీ ప్రత్యక్షతా మాకు కలిగించవా
మా హృదయంబు వెలిగించవా
హన్న ప్రార్ధనలు విన్నావుగా - నేనున్నానని అన్నావుగా
నాడు సమూయేలుతో బహుగ మాట్లాడిన
దేవమందిరమిదె మాట్లాడవా
ఆత్మ సత్యముతో ఆరాధింప
ఆత్మ దేవుండా నేర్పించుమా
సత్యమార్గంబులో మమ్ము నడిపించవా
నిత్యము నిన్ను స్తుతియింతుము
నాడు నిర్మించె దేవాలయం
రాజు సొలొమోను బహుసుందరం
అట్టి దేవాలయము మేము నిర్మించగా
నీ కట్టడలో మమ నిలుపవా
ఆ పరలోక ప్రతిబింబమై - ఈ ధరలోన దేదీప్యమై
ధరణి వెలిగించిన కరుణ ప్రసరింపను
కరము తోడుంచి నడిపించుము
ఓ సంఘమా సర్వాంగమా – పరలోక రాజ్యపు ప్రతిబింబమా
యేసయ్యను ఎదుర్కొనగ – నీతి నలంకరించి సిద్ధపడుమా
ఓ సంఘమా వినుమా
రాణి ఓఫిరు అపరంజితో – స్వర్ణ వివర్ణ వస్త్ర ధారణతో
వీణ వాయిద్య తరంగాలతో – ప్రాణేశ్వరుని ప్రసన్నతతో
ఆనంద తైల సుగంధాభిషేకము (2)
పొందితివా యేసునందు (2) ||ఓ సంఘమా||
క్రీస్తే నిన్ను ప్రేమించెనని – తన ప్రాణాలర్పించెనని
స్వస్థపరచె నిర్దోషముగా – ముడత కళంకము లేనిదిగ
మహిమా యుక్తంబుగా నిలువ గోరె యేసుడు (2)
సహియింతువా తీర్పునాడు (2) ||ఓ సంఘమా||
చీకటిలో నుండి వెలుగునకు – లోకములో నుండి వెలుపలకు
శ్రీకర్త గుణాతిశయములను – ప్రకటించుటకే పిలిచెనని
గుర్తించుచుంటివా క్రియలను గంటివా (2)
సజీవముగా నున్నావా (2) ||ఓ సంఘమా||
చల్లగనైన వెచ్చగను – ఉండిన నీకది మేలగును
నులివెచ్చని స్థితి నీకుంటే – బయటకు ఉమ్మబడెదవేమో
నీ మనసు మార్చుకో తొలిప్రేమ కూర్చుకో (2)
ఆసక్తితోడ రక్షణ నొందుమా (2) ||ఓ సంఘమా||
ఆలయంలో ప్రవేశించండి అందరు
స్వాగతం సుస్వాగతం యేసు నామంలో
మీ బ్రతుకులో పాపమా కలతలా
మీ హృదయంలో బాధలా కన్నీరా
మీ కన్నీరంతా తుడిచి వేయు రాజు యేసు కోసం
దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై
వెదికే వారికంతా కనబడు దీపము
యేసు రాజు మాటలే వినుట ధన్యము
వినుట వలన విశ్వాసం అధికమధికమై
ఆత్మలో దాహము తీరెను రారండి
ఆనందమానందం హల్లెలూయా
ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై
జీవ వృక్షంబుగా ఫలియించాలని
పెదవితో పలికెదం మంచి మాటలే
హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలై
నింపెదం నిండెదం కోరెదం పొందెదం
ఆనందమానందం హల్లెలూయా