Its a wonderful blog for telugu christian songs. Both Lyrics and Audio/Video available in this blog. you will definitely like this blog.
Monday, 20 November 2017
293. Edo Okati Edo Okati Cheyali Mana Yesu Rajunaku
292. Entha Madhuramu Manakentho Madhuramu Yesu Namame Athi Madhuryam Madhuryam
ఎంత మధురము - మనకెంతో మధురము
యేసు నామమే - అతి మాధుర్యం
క్రీస్తు నెరుగుటే - మన కానందం ఆనందం
కుంటివారు గెంతుచూ నడిచినారుగా
గుడ్డివారు దృష్టిని పొందినారుగా
కుష్టువ్యాధి గలవారు స్వస్థత పడినారుగా ఆ...ఆ.
మూగవారు ముద్దుగా మాటలాడినారుగా
యాయీరు కుమార్తెను బ్రదికించినాడుగా
లాజరును సమాధి నుండి లేపినాడుగా
దయ్యముల పిశాచములను వెళ్ళగ్టొినాడుగా ఆ...ఆ
అందరికి ఆ ప్రభువు అతి ఘనడైనాడుగా
అయిదు రొట్టెలు రెండు చిన్న చేపలున్
అయిదు వేల మందికి ఆహారమిచ్చెగా
పండ్రెండు గంపలు యింక మిగిలినాయిగా ఆ...ఆ
అందరికి ఆ ప్రభువు అతి ప్రియుడైనాడుగా
మన పాప శిక్షను తానె భరించెగా
సమాధి జయించి ప్రభువు తిరిగి లేచినాడుగా
సాతానును మరణమును చిత్తుగ ఓడించెగా ఆ...ఆ
అందరిలో ఆ ప్రభువు అతి విజయుడాయెగా
291. Idigo Vinuma O Lokama Thvaralo Prabhuvu
ఇదిగో వినుమా ఓ లోకమా త్వరలో ప్రభువు రానుండెను
సిద్ధపడుమా ఓ లోకమా సిద్ధపడుమా ఓ సంఘమా
మరనాత... ||ఇదిగో||
మహా మహా ఆర్భాటముతో - ప్రధాన దూత శబ్దముతో
దేవుని బూరతో ప్రభువు వేగమే దిగివచ్చును
ప్రభునందు మృతులు లేతురు సమాధులు తెరువగ
విశ్వాసులంత దాల్తురు మహిమ రూపును వింతగ
ఎత్తబడును సంఘము అయ్యో విడువబడుట ఘోరము
సిద్ధపడుమా ఓ లోకమా సిద్ధపడుమా ఓ సంఘమా
మరనాత...
||ఇదిగో||
ఏడేండ్లు భువిపై శ్రమకాలం - ప్రాణాలు జారే భయకాలం
ఊరలు తెగుళ్ళు దైవ ఉగ్రత పాత్రలు
ఆకాశ శక్తుల్ కదలును గతి తప్పును ప్రకృతి
కల్లోలమౌను లోకము రాజ్యమేలును వికృతి
సంఘమెంతొ హాయిరా మధ్యాకాశన విందురా
సిద్ధపడుమా ఓ లోకమా సిద్ధపడుమా ఓ సంఘమా
మరనాత...
||ఇదిగో||
అన్యాయము చేయువాని చేయనిమ్ము
అపవిత్రుడట్లే యుండనిమ్ము
పరిశుద్ధుడింకను పరిశుద్ధునిగుండనిమ్ము
ప్రతివాని క్రియల జీతము ప్రభు తెచ్చును ఒక దినం
రహాస్య క్రియలు అన్నియు బయలుపడునులే ఆ దినం
లోక ధనము కూడిరా నీకుంద పై సంపద ఆ...ఆ...
సిద్ధపడుమా ఓ లోకమా సిద్ధపడుమా ఓ సంఘమా
మరనాత...
||ఇదిగో||
ఓలీవకొండపై రారాజు అడుగుపెట్టెడి ఆరోజు
కొండయే చీలును భూగోళమే కంపించును
ప్రతి జనం ప్రభునే చూచును ప్రతి జాతియు మ్రొక్కును
నిజమైన ప్రభువు యేసని ప్రతి నాలుక ఒప్పును
ప్రభుని రెండవ రాకడ సాతానుకు దడదడ ఆ....ఆ...
సిద్ధపడుమా ఓ లోకమా సిద్ధపడుమా ఓ సంఘమా
మరనాత...
||ఇదిగో||
వెయ్యేండ్లు భూమిపై ప్రభు యేసు పాలించును పరిపాలించును
నీతి సమాధానం ఆత్మయందలి ఆనందం
ఈ భూమ్మీద నీ కృత్యముల్ సమస్తం కాలిపోవును
మిక్కటమైన వేడితో పంచభూతముల్ లయమగును
క్రొత్త భూమి ఆకాశం ఇక శాశ్వత జీవితం
సిద్ధపడుమా ఓ లోకమా సిద్ధపడుమా ఓ సంఘమా
మరనాత...
||ఇదిగో||
క్రీస్తేసులో విశ్వసించువారే పరిశుద్ధులుగా తీర్చబడ్డవారే
దేవుని మహిమకు నిత్యజీవమునకు అర్హులు
జీవం మరణం రెండును నీ యెదుటనే యున్నవి
ప్రభు యేసే జీవ మార్గమని నీకు తెలుపబడియున్నది
విశ్వసించు ప్రియుడా కాదు ................................
సిద్ధపడుమా ఓ లోకమా సిద్ధపడుమా ఓ సంఘమా
290. Idigo Idigo Idigo Idigo Ide Ide Ide Idigo
ఇదిగో ఇదిగో ఇదిగో ఇదిగో - ఇదె ఇదె ఇదె ఇదిగో
ఇదె ఇదె ఇదె ఇదిగో
ఇదియే మిక్కిలి అనుకూల సమయము
ఇదియే ఘనరక్షణ దినము
ఇప్పుడే యేసుని తప్పక నమ్మి ఆఆఆఆ
రక్షణ పొందుము సోదరా
పాప మెరుగని యేసుక్రీస్తు
పాపముగను చేయబడె
శాపగ్రాహి ఆయె సిలువలో ఆఆఆఆ
శ్రమలను పొందెను సోదరా
ఆకాశము క్రింద మనుష్యులలో
ఏ నామమున రక్షణ లేదు
యేసు నామమున రక్షణ కలుగును ఆఆఆఆ
ఇప్పుడే నమ్ముము సోదరా
నేనే ద్వారము నా ద్వారానే
లోపల ప్రవేశించిన యెడల
రక్షింపబడునని చెప్పిన ప్రభు ఆఆఆఆ
చెంతకు చేరుము సోదరా
ఇంతగొప్ప రక్షణను మనము
నిర్లక్ష్యము జేసిన యెడల
ఏలాగు తప్పించుకొందుము ఆఆఆఆ
ఇప్పుడే తిరుగుము సోదరా
289. Ascharyakarudu Alochana Kartha Nithyudagu Thandri
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
నిత్యుడగు తండ్రి సమాధానకర్త (2)
నీవంటి గొప్ప దేవుడు ఎవరున్నారు ప్రభు
నీకు సాటైనా దీటైనా దేవుడు లేడు ప్రభు (2)
తన చేతిలో రోగాలు లయమైపోయెను
తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను (2)
తన మాటతో ప్రకృతినే శాసించినవాడు (2)
నీటిపై ఠీవిగా నడచినవాడతడు (2)
మనకోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చినవాడతడు
మనకోసం సజీవుడై లేచినవాడతడు (2)
తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు (2)
తన సర్వాన్నే ధారబోసిన త్యాగశీలి క్రీస్తు (2)
288. Sharonu Maidanamutho Samamaina Madananbu
287. Vardhilledamu Mana Devuni Mandiramandu
వర్ధిల్లెదము మన దేవుని
మందిరమందు నాటబడినవారమై
నీతిమంతులమై మొవ్వు వేయుదము
యేసురక్తములోనే జయము మనకు జయమే
స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే
యెహోవా మందిర ఆవరణములో
ఎన్నోన్నె మేళ్ళు గలవు
ఆయన సన్నిధిలోనే నిలిచి
అనుభవింతుము ప్రతిమేలును
యేసయ్య సిలువ బలియాగములో
అత్యున్నత ప్రేమ గలదు
ఆయన సముఖములోనే నిలిచి
పొందెదము శాశ్వత కృపను
పరిశుద్ధాత్ముని అభిషేకములో
ఎంతో ఆదరణ కలదు
ఆయన మహిమైశ్వర్యము మన
దుఃఖము సంతోషముగ మార్చును
585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana
తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...
-
మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము ||2|| మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీవంటివారు ఎవరు నీవంటివారు లేరు ||2...
-
నా ప్రాణానికి ప్రాణం - నా జీవానికి జీవం నా హృదయానికి హృదయం నీవే నీవే నా పాదాలకు దీపం నా నావకు తీరం నా పయనానికి గమ్యం నీవే నీవే నా కొండ ...
-
ఆరాధన చేతును అన్ని వేళలా.... ఆత్మతో సత్యముతో ఆరాధింతును "2" నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు .... నన్ను కన్న తండ్రి నా యేసుకు.......