Tuesday, 23 January 2018

340. Nadipistadu Na Devudu Sramalonaina Nanu Viduvadu

నడిపిస్తాడు నా దేవుడు
శ్రమలోనైనా నను విడువడు (2)
అడుగులు తడబడినా అలసట పైబడినా (2)
చేయి పట్టి వెన్నుతట్టి చక్కని ఆలొచన చెప్పి (2) 

అంధకారమే దారి మూసినా
నిందలే నను కృంగదీసినా (2)
తన చిత్తం నెరవేర్చుతాడు
గమ్యం వరకు నను చేర్చుతాడు (2)        ||నడిపిస్తాడు||

కష్టాల కొలిమి కాల్చివేసినా
శోకాలు గుండెను చీల్చివేసినా (2)
తన చిత్తం నెరవేర్చుతాడు
గమ్యం వరకు నను చేర్చుతాడు (2)        ||నడిపిస్తాడు||

నాకున్న కలిమి కరిగిపోయిన
నాకున్న బలిమి తరిగిపోయిన (2)
తన చిత్తం నెరవేర్చుతాడు
గమ్యం వరకు నను చేర్చుతాడు (2)        ||నడిపిస్తాడు||

339. Asadhyamainadi Leneledu Nanu Balaparachuvadu Nalo Nundaga

అసాధ్యమైనది లేనే లేదు
నన్ను బలపరచువాడు నాతో ఉండగా (2)
ఊహించలేని ఆశ్చర్యక్రియలలో
నా దేవుడు నన్ను నడిపించును (2)
సాధ్యమే అన్ని సాధ్యమే
నా యేసు తోడైయుండగా (2)

శోధన శ్రమలు వచ్చినను
ఏ మాత్రము నేను వెనుతిరిగినను (2)
సత్య స్వరూపి సర్వోన్నతుడైన
గొప్ప దేవుడు నన్ను బలపరచును (2)         ||సాధ్యమే||

సాతాను శక్తులు ఎదిరించిన
వాక్యమనే ఖడ్గముతో జయించెదను (2)
సర్వశక్తుడు తన శక్తితో నింపి
సాతానుపై నాకు జయమిచ్చును (2)         ||సాధ్యమే||

338. Alala Paina Nadachina Nadu Yesayya

అలలపైన నడచిన - నాదు యేసయ్యా

గలిబిలి నా కలవరములను ||2|| 

తొలగజేసిన కలుషహరుడా

ఆదుకోవయ్యా నాదు యేసయ్యా

శుద్ధుడా నీ పిలుపు వింటిని అద్దరికి నే పయనమైతిని

ప్రొద్దుబోయెను భయములాయెను ||2||

ఉద్ధరింపగ స్వామి రావా

నట్టనడి సంద్రాన రేగె అట్టహాసపు పెనుతుఫాను

గట్టుచూడగ చాల దూరము ||2||

ఇట్టి శ్రమలో చిక్కుకొంటిని

అలలు నాపై విసరి కొట్టగ నావ నిండుగ నీరు చేరె

బ్రతుకుటెంతో భారమాయెను ||2||

రేవు చేరే దారిలేదే

మాట మాత్రపు  సెలవుచేత నీటుగా అద్భుతములెన్నో

చాల చేసిన శక్తిమంతుడు ||2||

జాలిజూపి దరిని చేర్చవా

చిన్న జీవిత నావనాది నిన్నెగురిగా పయనమైతిని 

ఎన్నోశోధనలెన్నో భయములు ||2||

గన్న తండ్రి కానరావా

337. Kshamiyinchumu O Prabhuva Padipothini Ninu Vidi



                క్షమియించుము ప్రభువా - పడిపోతిని నినువీడి
                నా హృదయమును కడిగి - పవిత్రుని చేయు ప్రభూ

 1.           నీ సన్నిధినే వదలి - అపవాదికి లోనైతి
               తెగిపోయిన పటమువలె - పయనించితి శూన్యములో

2.            నినువీడిన నా మనసు - వేసారెను వేదనతో
               చిగురించని మోడువలె - వాడెను నా జీవితము

 3.           కల్వరి రక్తములో - నను శుద్ధుని చేయుమయా
               కలుషములను ఎడబాపి - నిలుపుము నీ మార్గములో

 4.           నశియించిన నా ఆత్మన్‌ - రక్షించుము దేవా
               శుద్ధాత్మను నా కొసగి - నడుపుము నీ సత్యములో

 5.           నను దీక్షతో ప్రేమించి - నా కొరకై మరణించె
               నా పాపము హరియించు - నా భారము తొలగించు

 6.           నేనున్నది ప్రభులోనే - నా ప్రాణము ప్రభు కొరకే 
               నా కాపరి యేసేలే - నాకే కొదువను లేదు

336. Sudha Hrudayamu Kaluga Jeyumu



                శుద్ధ హృదయం కలుగ జేయుము
                నాలోనా.. నాలోనా

1.            నీ వాత్సల్యము నీ బాహుళ్యలము నీకృప కనికరము చూపించుము
               పాపము చేశాను దోషినై యున్నాను
               తెలిసియున్నది నా అతిక్రమమే తెలిసియున్నవి నా పాపములే
               నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా

 2.           నీ జ్ఞానమును నీ సత్యమును నా ఆంతర్యములో పుట్టించుము
               ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం
               కలుగజేయుము నా హృదయములో 
               నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా

335. Yesu Prabhuva Nenintha Kalamu

యేసుప్రభువ నేనింత కాలము
వృధా చేసితి నాజీవితమంతటిన్ అయ్యయ్యయ్యో

నా ఇష్టమే నా సౌఖ్యమే నా సొగసే నా స్నేహమే
ఇవియే నాకు ఘనమింని - అయ్యో మూర్ఖుడనై

నీ ఒసగిన దేహంబును నీ వరములన్ నీ జ్ఞానమున్
నీ సేవకై వాడనైతిన్ - ప్రభువా క్షమియించుము

నీ సిలువే నీ శ్రమలే నీ త్యాగమే నీ ప్రేమయే
ఇవియే నాకు శరణ్యమౌ - ప్రభువా రక్షణ్యమా

చాలునింకా నా ఇష్టము చాలునింకా లోకాశలు
ఇపుడే నే నీ వెంటవత్తున్ - ప్రభువా చేర్చుకొనుమా

334. Margamu Chupumu Intiki Na Thandri Intiki

మార్గము చూపుము ఇంటికి - నాతండ్రి ఇంటికి
మాధుర్య ప్రేమాప్రపంచము - చూపించు కంటికి

పాప మమతలచేత పారిపోయిన నాకు ప్రాప్తించె క్షామము
పశ్చాత్తాపమునొంది తండ్రి క్షమగోరుచు పంపుము క్షేమము
ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము

ధనమే సర్వంబనుచు సుఖమే స్వర్గంబనుచు తండ్రిని వీడితి
ధరణీబోగములెల్ల బ్రతుకు ధ్వంసముజేయ దేవా నినుచేరితి
దేహి అని నీవైపు చేతులెత్తిన నాకు దారిని జూపుము

దూరదేశములోన బాగుండు ననుకొనుచు తప్పితి మార్గము
తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల తరిమె దారిద్య్రము
దాక్షిణ్యమూర్తి నీ దయ నాపై కురిపించి ధన్యుని జేయుము

అమ్ముకొంటిని నన్ను అధముడొకనికి నాదు ఆకలి బాధలో
అన్యాయమయిపోయె పందులు సహ వెలివేయ అలవడెను వేదన
అడుగంటె అవినీతి మేల్కొనియే మానవత ఆశ్రయము జూపుము

కొడుకునే కాదనుచు గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళితి
కూలివానిగనైన నీయింట పనిచేసి కనికరమే కోరుదున్
కాదనకు నాతండ్రి దిక్కెవ్వరును లేరు క్షమియించి బ్రోవుము

నాతండ్రి ననుజూచి పరుగిడుచు ఏతెంచి నాపైబడి యేడ్చెను
నవజీవమును కూర్చి ఇంటికి తోడ్కొనివెళ్ళి నన్ను దీవించెను
నాజీవిత కధయంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమైయుండును

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...