Tuesday, 23 January 2018

338. Alala Paina Nadachina Nadu Yesayya

అలలపైన నడచిన - నాదు యేసయ్యా

గలిబిలి నా కలవరములను ||2|| 

తొలగజేసిన కలుషహరుడా

ఆదుకోవయ్యా నాదు యేసయ్యా

శుద్ధుడా నీ పిలుపు వింటిని అద్దరికి నే పయనమైతిని

ప్రొద్దుబోయెను భయములాయెను ||2||

ఉద్ధరింపగ స్వామి రావా

నట్టనడి సంద్రాన రేగె అట్టహాసపు పెనుతుఫాను

గట్టుచూడగ చాల దూరము ||2||

ఇట్టి శ్రమలో చిక్కుకొంటిని

అలలు నాపై విసరి కొట్టగ నావ నిండుగ నీరు చేరె

బ్రతుకుటెంతో భారమాయెను ||2||

రేవు చేరే దారిలేదే

మాట మాత్రపు  సెలవుచేత నీటుగా అద్భుతములెన్నో

చాల చేసిన శక్తిమంతుడు ||2||

జాలిజూపి దరిని చేర్చవా

చిన్న జీవిత నావనాది నిన్నెగురిగా పయనమైతిని 

ఎన్నోశోధనలెన్నో భయములు ||2||

గన్న తండ్రి కానరావా

6 comments:

Preminthunu Prabhuva Ninnu Lyrics | ప్రేమింతును ప్రభువా నిన్ను | Telugu Christian Song Lyrics # 609

ప్రేమింతును ప్రభువా నిన్ను సాంగ్ లిరిక్స్ (Preminthunu Prabhuva Ninnu Lyrics) పల్లవి: ప్రేమింతును ప్రభువా నిన్ను ప్రార్ధింతును ...