జీవితాలను వెలిగించువాడు
బ్రతుకు నావ నడిపించువాడు
యెహోవాయే నాకుండగా (2)
నేను సాధించలేనిది లేనే లేదు
జయించలేనిది లేనే లేదు
అసాధ్యమైనది లేనే లేదు
విజయమెప్పుడూ నాదే (2)
జలములు నాపైకి లేచిననూ (2)
సంకెళ్లు నను బిగదీసిననూ
శత్రు గోడలు అడ్డుగా నిలచిననూ (2) ||నేను||
బంధువులందరు నను విడచిననూ (2)
వ్యాధులెన్నో నను చుట్టిననూ
అడ్డంకులెన్నో నాకెదురైననూ (2) ||నేను||