Tuesday, 27 February 2018

381. Marani Devudavu Nivenayya

మారని దేవుడవు నీవేనయ్యా
మరుగై ఉండలేదు నీకు యేసయ్యా (2)
సుడులైనా సుడిగుండాలైనా వ్యధలైనా వ్యాధి బాధలైనా
మరుగై ఉండలేదు నీకు యేసయ్యా (2)         ||మారని||
చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా
నిలకడలేని నా బ్రతుకును మార్చితివే (2)
మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా (2)
మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా (2) ||మారని||
నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినా
నిత్య జీవ గమ్యానికి నను నడిపించితివే (2)
నిలచి ఉందునయ్యా నిజ దేవుడవనుచు (2)
నన్ను చూచినావయ్యా నన్ను కాచినావయ్యా (2) ||
మారని||

No comments:

Post a Comment

Sarvadhikariyaina Sarva Sakthimanthudu | Telugu Christian Song # 604

ఏదైనా సాధ్యమే | Telugu Christian Song ✨ ఏదైనా సాధ్యమే ✨ సర్వాధికారియైన సర్వశక్తిమంతుడు అధిక ప్రేమామయ...

About Me

My photo
I’m Gnana Ratnam Veladuti, a devoted Christian sharing devotional messages and sermons. My goal is to encourage believers to stay strong in faith.

📌 Follow my blog for daily inspiration and spiritual encouragement.