Tuesday 27 February 2018

380. Nilabaduma O Manasa Kadavaraku Sharonulo

నిలబడుమా ఓ మనసా
కడవరకు షారోనులో 
(2)
కష్టము నష్టము లెన్నో వచ్చిన
కలవర పడకుము రాకడ వరకు 
(2)  IIనిలII

తప్పిపోయిన గొర్రెవలె
దారి విడువక నిలబడుము (2)
ప్రాణ ప్రియుండు ప్రభుయేసు
ప్రాణము పెట్టెను మనకొరకు  
(2)       IIనిలII

ఆపదలు చెలరేగి
ఆవరించిన భయపడకు (2)
ఆత్మబలుండు శ్రీయేసు
ఆదరించును మేల్కొనుము 
(2)     IIనిలII

నిలువుము ప్రభు సన్నిధిలో
కలవు సిరి సంపదలు (2)
వెదకిన దొరకును ఫలములు నీకు
వెరువక మెప్పుడు ఓ మనసా  
(2)  IIనిలII

మాటకు మాటలు మార్చకుము
మహిమను విడిచి వెళ్ళకుము  (2)
మహిమగల ప్రభు శ్రీయేసు
మాట వినుమా ఓ మనసా    
(2)    IIనిలII

మొదటి వనము ఏదేను
రెండవది సింధూర వనము (2)
మూడవది గెత్సేమనె వనము
నాల్గవది షారోను వినుము  
(2)    IIనిలII

No comments:

Post a Comment

578. Nenu Na Illu Na Intivarunu

నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్తుతించెదము (2) నీ కనుపాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం (2) ఎబినేజరే ఎబినేజరే – ఇంత క...