నిలబడుమా ఓ మనసా
కడవరకు షారోనులో (2)
కష్టము నష్టము లెన్నో వచ్చిన
కలవర పడకుము రాకడ వరకు (2) IIనిలII
తప్పిపోయిన గొర్రెవలె
దారి విడువక నిలబడుము (2)
ప్రాణ ప్రియుండు ప్రభుయేసు
ప్రాణము పెట్టెను మనకొరకు (2) IIనిలII
ఆపదలు చెలరేగి
ఆవరించిన భయపడకు (2)
ఆత్మబలుండు శ్రీయేసు
ఆదరించును మేల్కొనుము (2) IIనిలII
నిలువుము ప్రభు సన్నిధిలో
కలవు సిరి సంపదలు (2)
వెదకిన దొరకును ఫలములు నీకు
వెరువక మెప్పుడు ఓ మనసా (2) IIనిలII
మాటకు మాటలు మార్చకుము
మహిమను విడిచి వెళ్ళకుము (2)
మహిమగల ప్రభు శ్రీయేసు
మాట వినుమా ఓ మనసా (2) IIనిలII
మొదటి వనము ఏదేను
రెండవది సింధూర వనము (2)
మూడవది గెత్సేమనె వనము
నాల్గవది షారోను వినుము (2) IIనిలII