Friday, 9 March 2018

408. Madilona Ninnu Padilambuganu

మదిలోన నిన్ను పదిలంబుగాను
హృదిలోన నీదు వాక్యంబునుండ
కలిగేను శాంతి ఈ ధరణిలోన
కలిగేను శాంతి నా మదిలోన

ఎన్నెన్నో శ్రమలు కష్టాలు కలిగిన
నీ రెక్కల క్రింద నీ అండ నాకుండ
కలిగేను శాంతి ఈ ధరణిలోన
కలిగేను శాంతి నా మదిలోన

శోధనలు ఎన్నో వెన్నింవున్న
నాకుంది క్షేమం నీ కాపుదలలో
కలిగేను శాంతి ఈ ధరణిలోన
కలిగేను శాంతి నా మదిలోన

407. Parama Jeevamu Nakunivva

పరమ జీవము నాకు నివ్వ
తిరిగి లేచెను నాతో నుండ
నిరంతరము నన్ను నడిపించును
మరల వచ్చి యేసు కొని పోవును
యేసు చాలును – చాలును
యేసు చాలును – చాలును
యే సమయమైన యే స్థితికైన
నా జీవితములో యేసు చాలును

సాతాను శోధనలధికమైన
సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను
లోకము శరీరము లాగినను
లోబడక నేను వెళ్ళెదను                  ||యేసు||

పచ్చిక బయలులో పరుండజేయున్
శాంతి జలము చెంత నడిపించును
అనిశము ప్రాణము తృప్తిపరచున్
మరణ లోయలో నన్ను కాపాడును ||యేసు||

నరులెల్లరు నన్ను విడిచినను
శరీరము కుళ్ళి కృశించినను
హరించినన్ నా ఐశ్వర్యము
విరోధివలె నన్ను విడచినను          ||యేసు||

406. Ne Yesuni Vembadinthunanni

నే యేసుని వెంబడింతునని
నేడేగా నిశ్చయించితిని
నే వెనుదిరుగన్ వెనుకాడన్
నేడేసుడు పిల్చిన సుదినం                          ||నే యేసుని||

నా ముందు సిలువ నా ముందు సిలువ
నా వెనుక లోకాశల్ నాదే దారి
నా మనస్సులో ప్రభు నా మనస్సులో ప్రభు
నా చుట్టు విరోధుల్ నావారెవరు
నా యేసుని మించిన మిత్రుల్
నాకిలలో గానిపించరని                              ||నే యేసుని||

కరువులైనను కరువులైనను
కలతలైనను కలిగినను
కలిమి లేములు కలిమి లేములు
కలవరంబులు కలిగినను
కదలనింకా కష్టములైన
వదలను నాదు నిశ్చయము                       ||నే యేసుని||

శ్రమయైనను శ్రమయైనను
బాధలైనను హింసయైన
వస్త్రహీనత వస్త్రహీనత
ఉపద్రవములు ఖడ్గములైన
నా యేసుని ప్రేమనుండి
నను యెడబాపెటి వారెవరు                    ||నే యేసుని||

405. Nivu Leni Roju Asalu Roje Kadaya

నీవు లేని రోజు అసలు రోజే కాదయా
నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా (2)
నీవే లేకపోతే నేనసలే లేనయా (2)          ||నీవు లేని||

బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు
నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు (2)
నన్ను విడువనన్నవు – నా దేవుడైనావు (2)    ||నీవే||

ఈ నాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే
నేను కలిగియున్నవన్ని నీదు కృపా భాగ్యమే (2)
నీవు నా సొత్తన్నావు – కృపాక్షేమమిచ్చావు (2)||నీవే||

404. Nikanna Lokana Nakevarunnarayya

నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా
నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా

నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా
ప్రాణం పెట్టిన దేవుడవు నీవే యేసయ్యా

నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా
జీవం ఉన్న దేవుడవు నీవే యేసయ్యా

నీలా రక్షించేవారు ఎవరున్నారయ్యా
రక్తం కార్చిన దేవుడవు నీవే యేసయ్యా

నీలా పోషించేవారు ఎవరున్నారయ్యా
అన్నీ తెలిసిన దేవుడవు నీవే యేసయ్యా

403. Ninne Ninne Ne Koluthunayya

యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా (2)
యేసయ్య యేసయ్య యేసయ్యా…

కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో (2)
నన్ను గమనించినావా
నన్ను నడిపించినావా (2)        ||యేసయ్యా||

ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులు నన్ను అపహసించగా (2)
అండ నీవైతివయ్యా
నా.. కొండ నీవే యేసయ్యా (2)      ||యేసయ్యా||

మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2)
నన్ను బలపరచెనయ్యా
నిన్నే ఘనపరతునయ్యా (2)      ||యేసయ్యా||

వంచెన వంతెన ఒదిగిన భారాన
ఒసగక విసిగిన విసిరే కెరటాలు (2)
అలలు కడతేర్చినావా
నీ వలలో నను మోసినావా (2)      ||యేసయ్యా||

402. Naloni Asa Naloni Korika

నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చూడాలని
నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చేరాలని
దేవా.. యేసయ్యా నిన్ను చూడాలని
దేవా… యేసయ్యా నిన్ను చేరాలని

జీసస్ ఐ వాంట్ టు వర్షిప్ యూ
జీసస్ ఐ వాంట్ టు ప్రెయిస్ యూ లార్డ్ (2)
మై జీసస్.. ఐ వాంట్ టు సీ యూ
మై జీసస్.. ఐ వాంట్ టు సీ యూ.. ఫరెవర్

శ్రమలు నన్ను తరిమినా – విడువలేదు నీ కృప
వేదనలో నేను కృంగినా – లేవనెత్తెను నీ చేయి (2)
ఎన్ని యుగాలకైనను స్తుతులకు పాత్రుడా
తరతరాలు మారినా మారని దేవుడా         ||జీసస్||

విరిగి నలిగిన మనస్సుతో నీ దరి చేరితి యేసయ్యా
మధురమైన నీ ప్రేమతో నన్ను నింపుము నా దేవా (2)
తుది శ్వాస వరకు దేవా నిన్నే కీర్తించెద
నా బ్రతుకు దినములన్ని నిన్ను పూజింతును ||జీసస్||

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...