నా నీతికి ఆధారం ప్రభూ నీవేకదా నీవేెకదా
నా రక్షణ కాధారం ప్రభూ నీవేకదా నీవేకదా
నిను నమ్మినవాడను (దానను) నన్నంగీకరించుము
నా శ్రమలో మొరపెట్టగా నా కన్నీరు తుడిచావయ్యా
నిను గాక మరిదేనిని నే కోరలేదయ్యా
నిను నమ్మినవాడను (దానను) నన్నంగీకరించుము
నా కొరకు ఆ సిలువపై మరణించినావయ్యా
నీ ప్రేమ వర్ణించుట నా తరముకాదయ్యా
నిను నమ్మినవాడను (దానను) నన్నంగీకరించుము
నీవు తూచే ఆ త్రాసులో నే సరితూగలేనయ్యా
కడవరకు నీ ప్రేమను నే చాటెదన్ ప్రభూ
నిను నమ్మినవాడను (దానను) నన్నంగీకరించుము