Wednesday, 28 March 2018

442. Thanuvu Nadidigo Gaikonumi

తనువు నా దిదిగో గై – కొనుమీ యో ప్రభువా
నీ పనికి బ్రతిష్టించుమీ
దినములు క్షణములు – దీసికొని యవి నీదు
వినతిన్ ప్రవహింప జే – యను శక్తి నీయుమీ      ||తనువు||
ఘనమైన నీ ప్రేమ – కారణంబున నీకై
పని చేయ జేతు లివిగో
యనయంబు నీ విషయ – మై సొగసుగా జురుకు
దనముతో పరుగెత్త – వినయ పాదము లివిగో    ||తనువు||
స్వర మిదిగో కొనుమీ – వరరాజ నిను గూర్చి
నిరతమ్ము పాడనిమ్ము
మరియు పెదవు లివిగో – మహనీయమైన నీ
పరిశుద్ధ వార్తతో – బరి పూర్ణముగా నింపు      ||తనువు||
వెండి పసిడి యివిగో – వీస మైనను నాకై
యుండవలెనని కోరను
నిండైన నీ యిష్ట – నియమంబు చొప్పున
మెండుగా వాడబడి – మితియవు జ్ఞానంబిదిగో ||తనువు||
నా యిష్ట మిదిగో యిది – నీ యిష్టముగ జేయ
నా యిష్ట మిక గాదది
నా యిఛ్చ యున్నట్టి – నా హృదయ మిదిగో నీ
కే యియ్యది రాజ – కీయ సింహాసనామౌ      ||తనువు||
ఉన్న నా ప్రేమ నీ – సన్నిధానముననే
నెన్నడు ధార వోయన్
నన్ను నీ వానిగ – నాథా గైకొను మపుడు
చెన్నుగ నీ వశమై – స్థిర ముగ నుండెద      ||తనువు||

Tuesday, 27 March 2018

441. Jivithanthamu Varaku NIke Seva Salpudunantini


జీవితాంతము వరకు నీకే – సేవ సల్పుదునంటిని
నీవు నాతో నుండి ధైర్యము – నిచ్చి నడుపుము రక్షకా 

ఎన్ని యాటంకంబులున్నను – ఎన్ని భయములు కల్గిన
అన్ని పోవును నీవు నాకడ – నున్న నిజమిది రక్షకా 

అన్ని వేళల నీవు చెంతనె – యున్న యనుభవమీయవె
తిన్నగా నీ మార్గమందున – పూనినడచెద రక్షకా

నేత్రములు మిరుమిట్లు గొలిపెడి – చిత్రదృశ్యములున్నను
శత్రువగు సాతాను గెల్వను – చాలు నీ కృప రక్షకా 

నాదు హృదయమునందు వెలుపట – నావరించిన శత్రులన్
చెదర గొట్టుము రూపుమాపుము – శ్రీఘ్రముగ నారక్షకా

మహిమలో నీవుండు చోటికి – మమ్ము జేర్చెదనంటివే
ఇహము దాటినదాక నిన్ను – వీడనంటివి రక్షకా 

పాప మార్గము దరికి బోవక – పాత యాశల గోరక
ఎపుడు నిన్నే వెంబడింపగ – కృప నొసంగుము రక్షకా 

440. Cheyi Pattuko Na Cheyi Pattuko


చేయి పట్టుకో నా చేయి పట్టుకో
జారిపోకుండా నే పడిపోకుండా
యేసు నా చేయి పట్టుకో                 ||చేయి||

కృంగిన వేళ ఓదార్పు నీవేగా
నను ధైర్యపరచు నా తోడు నీవేగా (2)
మరువగలనా నీ మధుర ప్రేమను
యేసు నా జీవితాంతము (2)
యేసు నా జీవితాంతము              ||చేయి||

లోక సంద్రము నాపైకి ఎగసిన
విశ్వాస నావలో కలవరమే రేగిన (2)
నిలువగలనా ఓ నిమిషమైననూ
యేసు నా చేయి విడిచినా (2)
యేసు నా చేయి విడిచినా             ||చేయి||

439. Gamyam Cheralani Nitho Undalani Pagalu Reyi Paravasinchalani


గమ్యం చేరాలని నీతో ఉండాలని
పగలూ రేయి పరవశించాలని
ఈ నింగి నేలా కనుమరుగైనను
శాశ్వత జీవం పొందాలని
సాగిపోతున్నాను నిన్ను చూడాలని
నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని (2)       ||గమ్యం||

భువి అంతా తిరిగి జగమంతా నడచి
నీ జ్ఞానముకు స్పందించాలని
నాకున్నవన్ని సమస్తం వెచ్చించి
నీ ప్రేమ ఎంతో కొలవాలని
అది ఎంత ఎత్తున ఉందో – అది ఎంత లోతున ఉందో
అది ఏ రూపంలో ఉందో – అది ఏ మాటల్లో ఉందో  ||సాగి||

అలలెన్నో రేగిన శ్రమలెన్నో వచ్చిన
శిరమును వంచి సహించాలని
వేదన బాధలు గుండెను పిండిన
నీదు సిలువనే మోయాలని
నా గుండె కోవెలలోనా – నిన్నే నే ప్రతిష్టించి
నీ సేవలో నే ఇలలో – నా తుది శ్వాసను విడవాలని ||సాగి||

438. Kanniti Kadalilo Kristhu Ni Padavalo Kadilindi Na Brathuku Yathra

కన్నీటి కడలిలో - క్రీస్తూ నీ పడవలో

కదిలింది నా బ్రతుకు యాత్ర - కరిగింది నా గత చరిత్ర

గతమెంచి నావారే పతితంచు బిలిచారే

భీతించి బాధించినారే వేదించి వెలివేసినారే

మితిమించిన ప్రేమ నేతెంచి రక్షించి

నీ చెంత నను జేర్చినావా నా చింతలే దీర్చినావా

దుష్టాత్మలే యేడు యిష్టాన నను గూడు

కష్టాల పాల్జేసెనాడు దృష్టించు నీవే నాతోడు

వీక్షించినావు రక్షించనీవు

దయ్యాల నదిలించినావు ఓ అయ్య నన్‌ నిల్పినావు

నీ సిల్వ మరణాన్ని నా పాప భరణాన్ని

కనులార నే గాంచినాను మనసారగా యేడ్చినాను

నీ వ్రేలు చరణాల నే వ్రాలి నీ మ్రోల

నీ ప్రేమ ధ్యానించినాను నా దేవ తరియించినాను

చిరుచీకటిలో నిన్ను దరిశించ కన్నీళ్ళ

మరుభూమి కరుదెంచినాను వెదుకాడి వేసారినాను

నినుగాన లేక నువు నాకు లేక

విలపించుచున్నాను దేవా ఓదార్చగా వేగరావా

గతిలేని నను జూచి అతిగా దయ తలచి

ప్రియమార పేరెత్తినావే కృపలూర కళ్ళొత్తినావే

నే దీనహీన మౌ మగ్దలీనా

నిను మోసికొని నేను పోనా నీ ప్రేమ చాటించలేనా

437. Enni Thalachina Edi Adigina


ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా
నీ వాక్కుకై వేచియుంటిని
నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా

నీ తోడు లేక నీ ప్రేమ లేక
ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2)
అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2)
నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా      ||ఎన్ని||

నా ఇంటి దీపం నీవే అని తెలసి
నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2)
ఆరిపోయిన నా వెలుగు దీపము (2)
వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా      ||ఎన్ని||

ఆపదలు నన్ను వెన్నంటియున్నా
నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2)
లోకమంతయూ నన్ను విడచినా (2)
నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా      ||ఎన్ని||

నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి
నా కొరకై కల్వరిలో యాగమైతివి (2)
నీదు యాగమే నా మోక్ష మార్గము (2)
నీయందే నిత్యజీవము (2) ప్రభువా         ||ఎన్ని||

436. Idigo Deva Na Jivitham Apadamasthakam Nikankitham


ఇదిగో దేవా నా జీవితం
ఆపాదమస్తకం నీకంకితం (2)
శరణం నీ చరణం (4)                       ||ఇదిగో||

పలుమార్లు వైదొలగినాను
పరలోక దర్శనమునుండి
విలువైన నీ దివ్య పిలుపుకు
నే తగినట్లు జీవించనైతి (2)
అయినా నీ ప్రేమతో
నన్ను దరిచేర్చినావు
అందుకే గైకొనుము దేవా
ఈ నా శేష జీవితం                         ||ఇదిగో||

నీ పాదముల చెంత చేరి
నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
నీ హృదయ భారంబు నొసగి
ప్రార్థించి పనిచేయనిమ్ము (2)
ఆగిపోక సాగిపోవు
ప్రియసుతునిగా పనిచేయనిమ్ము
ప్రతి చోట నీ సాక్షిగా
ప్రభువా నన్నుండనిమ్ము           ||ఇదిగో||

విస్తార పంట పొలము నుండి
కష్టించి పని చేయ నేర్పు
కన్నీటితో విత్తు మనసు
కలకాలం మరి నాకు నొసగు (2)
క్షేమ క్షామ కాలమైనా
నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా
నశియించే ఆత్మలన్
నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా   ||ఇదిగో||

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...