విరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా (2)
ఆశీర్వదించితివి అబ్రహాముగా మార్చితివి (2)
ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి (2)
సౌలును విరిచితివి పౌలుగా మార్చితివి (2)
Its a wonderful blog for telugu christian songs. Both Lyrics and Audio/Video available in this blog. you will definitely like this blog.
నిన్ను విడువను యేసుప్రభు
నిన్ను విడువగ లేను
ఎన్నడును నిను బాసి
ఏమిచేయగజాల నా ప్రభువా II నిన్నుII
నిను మరచి తిరుగుచు నేనుండిన
నీ సన్నిధి విడచి ఎటుబోయిన
నను మరువకను మరి విడువకను
వెనువెంట నుంటివి కాదా నా ప్రభువా! II నిన్నుII
అనుదిన జీవితమును మదినెంచగా
అనుకొనని అపాయము లెన్నెన్నియో
నను సంధించగా నను బంధించగా
నన్నాదుకొింవి గాదా నా ప్రభువా! II నిన్నుII
పలు సమయములందున నీ చిత్తమున్
పరిపూర్ణముగా నే నెరుంగక
మేలని తలచి కీడునె యడుగ
వలదంచు నిలిపితి వాహా నా ప్రభువా! II నిన్నుII
నీ మేలుల నన్నిటి నే నెంచగా
నీ ప్రేమామృతమును చవి చూడగా
నా మది భక్తితో నా హృది ప్రేమతో
ఉప్పొంగి పొరలెను గాదా నా ప్రభువా! II నిన్నుII
నిండు మనసుతో - నిన్నే కొలిచేము దేవా
రెండు కనులలో నిన్నే - నిలుపు కొంటిమయ్య
పండు వెన్నెలే మాకు నీ కరుణ కాంతి II నిండుII
పరిపక్వమైన మా పాపాల నెల్లబాపి
దరిలేని మా బ్రతుకున వెలుగుబాట చూపి
పరిశుద్ధమైన నీ మోక్షమార్గమందు నిలిపి
దరిచేర్చి సంరక్షించు మా పాలి దైవమా II నిండుII
నీ నీతివాక్యములే పాటింతుమయ్య
నీ అడుగు జాడలలోనే పయనింతుమయ్య
నీ గణతియే జగతికి మోక్షమార్గమయ్య
నీ చరణ దాసులమయ్య పాలించరావయ్య II నిండుII
నా నీతికి ఆధారం ప్రభూ నీవేకదా నీవేెకదా
నా రక్షణ కాధారం ప్రభూ నీవేకదా నీవేకదా
నిను నమ్మినవాడను (దానను) నన్నంగీకరించుము
నా శ్రమలో మొరపెట్టగా నా కన్నీరు తుడిచావయ్యా
నిను గాక మరిదేనిని నే కోరలేదయ్యా
నిను నమ్మినవాడను (దానను) నన్నంగీకరించుము
నా కొరకు ఆ సిలువపై మరణించినావయ్యా
నీ ప్రేమ వర్ణించుట నా తరముకాదయ్యా
నిను నమ్మినవాడను (దానను) నన్నంగీకరించుము
నీవు తూచే ఆ త్రాసులో నే సరితూగలేనయ్యా
కడవరకు నీ ప్రేమను నే చాటెదన్ ప్రభూ
నిను నమ్మినవాడను (దానను) నన్నంగీకరించుము
తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...