Wednesday, 28 March 2018

447. Ninnu Viduvanu Yesu Prabho

నిన్ను విడువను యేసుప్రభు
నిన్ను విడువగ లేను
ఎన్నడును నిను బాసి
ఏమిచేయగజాల నా ప్రభువా                 II నిన్నుII

నిను మరచి తిరుగుచు నేనుండిన
నీ సన్నిధి విడచి ఎటుబోయిన
నను మరువకను మరి విడువకను
వెనువెంట నుంటివి కాదా నా ప్రభువా!     II నిన్నుII

అనుదిన జీవితమును మదినెంచగా
అనుకొనని అపాయము లెన్నెన్నియో
నను సంధించగా నను బంధించగా
నన్నాదుకొింవి గాదా నా ప్రభువా!            II నిన్నుII

పలు సమయములందున నీ చిత్తమున్
పరిపూర్ణముగా నే నెరుంగక
మేలని తలచి కీడునె యడుగ
వలదంచు నిలిపితి వాహా నా ప్రభువా!     II నిన్నుII

నీ మేలుల నన్నిటి నే నెంచగా
నీ ప్రేమామృతమును చవి చూడగా
నా మది భక్తితో నా హృది ప్రేమతో
ఉప్పొంగి పొరలెను గాదా నా ప్రభువా!     II నిన్నుII

No comments:

Post a Comment

స్థిరపరచువాడవు | ఏమైనా చేయగలవు | Telugu Christian Song #594

స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొ...