నీకిష్టమైనది.. కావాలి దేవునికి
బలి అర్పణ కోరలేదు దేవుడు
బలి అర్పణ కోరలేదు దేవుడు..
ప్రభు మనసు తెలుసుకో వాక్యాన్ని చదువుకో..
కయీను అర్పణ తెచ్చాడు దేవునికి
హేబేలు అర్పణ నచ్చింది దేవునికి
అర్పించువాటి కంటే - అర్పించు మనిషి ముఖ్యం
అర్పించువాటి కంటే - అర్పించు మనసు ముఖ్యం
నచ్చాలి మొద నీవే - కావాలి మొదట నీవే..
దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా
క్రీస్తేసువలె దేహం కావాలి యాగముగా
నీ ధనము ధాన్యము కంటే - ఒక పాపి మార్పు ముఖ్యం
నీ ధనము ధాన్యము కంటే - ఒక పాపి మార్పు ముఖ్యం
ప్రకటించు క్రీస్తు కొరకే - మరణించు పాపి కొరకే