494. Pakshiraju vale Rekkalu Chapi Paikeguruduma
పక్షిరాజువలె రెక్కలు
చాపి పైకెగురుదామా
అలయక సొమ్మసిల్లక పైకెగురుదామా
ఆ శాశ్వత లోకము కొరకు
నిత్యరాజ్యము కొరకు
ఈ లోక స్నేహితులు
ఈ లోక బంధువులు
జన్మనిచ్చిన తల్లిదండ్రులు
ఎవరులేక ఒంటరిస్థితిలో
ప్రేమలన్ని కోల్పోయినా క్రీస్తేసు
ప్రేమలో సాగిపోదమా
ఈ లోక పోరాటము సాతాను శోధనలు
హృదయమును కృంగదీసినా
అడుగడుగున
సంకెళ్ళతో అడుగువేయలేకున్నా
క్రీస్తేసు ప్రేమలో ఎగిరిపోదమా
ఆ మహిమ రాజ్యములో
ఆ నిత్య రాజ్యములో
కన్నీరుండదు దిగు లుండదు
ఎల్లప్పుడు సంతోషముతో ఎల్లప్పుడ
ు
ఆనందముతో హల్లేలూయా
గీతాలతో నిలిచిపోదుమా
493. Paralokame Na Anthapuram Cheralane Na Thapatrayam
చేరాలనే నా తాపత్రయం
యేసుదేవరా కనికరించవా దారి చూపవా
నా భవ్య జీవితం మహోజ్వలం
మజిలీలు దాటే మనోబలం
నీ మహిమ చూసే మధుర క్షణం
వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఈయవా
పరులను ప్రేమించే మనసే నాకివ్వు
ఉద్రేక పరచే దురాత్మను
ఎదురించి పోరాడే శుద్ధాత్మను
మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా
492. Oka Divyamaina Sanghathitho Na Hrudayamu Uppongenu
ఒక దివ్యమైన సంగతితో
నా హృదయము ఉప్పొంగెను (2)
యేసు రాజని నా ప్రియుడని
ప్రియ స్నేహితుడు క్రీస్తని ||ఒక దివ్యమైన||
పదివేల మందిలో నా ప్రియుడు యేసు
దవళవర్ణుడు అతి కాంక్షణీయుడు (2)
తన ప్రేమ వేయి నదుల విస్తారము (2)
వేవేల నోళ్లతో కీర్తింతును (2) ||ఒక దివ్యమైన ||
పండ్రెండు గుమ్మముల పట్టణములో
నేను నివాసము చేయాలని (2)
తన సన్నిధిలో నేను నిలవాలని (2)
ప్రభు యేసులో పరవశించాలని (2) ||ఒక దివ్యమైన ||