Wednesday, 4 April 2018

495. Parishudha Simhasanam Nidu Nivasa Sthalamu

పరిశుద్ధ సింహాసనం
నీదు నివాస స్థలము
ఈ భూమి నీ పాదపీఠం
ఈ సృష్టి నీ చేతి పనియే
హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా

సెరాపులు కెరూబులు
పరిశుద్ధుడు పరిశుద్ధుడని
చేయు ప్రతిగానములకు
నీవె యోగ్యుడవయ్యా

మార్గమును సత్యమును
జీవమునైయున్న మా దేవా
మాదు హృదయమే నీదు ఆలయమం
మాలోన వసియించు ప్రభువా

అల్ఫయును ఓమేగయును
యుగయుగములకు సజీవుడవు
ఆకాశ భూమి గతించినను
నీవే మా దేవుడవయ్యా

No comments:

Post a Comment

స్థిరపరచువాడవు | ఏమైనా చేయగలవు | Telugu Christian Song #594

స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొ...