Wednesday, 3 July 2019

505. Na Neethi Suryuda Bhuvinelu Yesayya

నా నీతి సూర్యుడా - భువినేలు యేసయ్యా
సరిపోల్చలేను నీతో- ఘనులైన వారిని (2)
రాజులకే......... మహారాజవు
కృపచూపే........ దేవుడవు
నడిపించే......... నజరేయుడా
కాపాడే........... కాపరివి (2)              ||నా నీతి||

శ్రమలలో - బహుశ్రమలలో- ఆదరణ కలిగించెను
వాక్యమే - కృపావాక్యమే - నను వీడని అనుబంధమై (2)
నీమాటలే - జలధారాలై - సంతృప్తి నిచ్చెను
నీమాటలే - ఔషధమై - గాయములు కట్టెను
నీ మాటే మధురం
రాజులకే......... మహారాజవు
కృపచూపే........ దేవుడవు
నడిపించే......... నజరేయుడా
కాపాడే........... కాపరివి                  ||నా నీతి||

మేలులకై - సమస్తమును - జరిగించుచున్నావు నీవు
ఏదియు - కొదువ చేయవు - నిన్నాశ్రయించిన వారికి (2)
భీకరమైన కార్యములు - చేయుచున్నవాడా
సజీవుడవై - అధిక స్తోత్రము - పొందుచున్నవాడా
ఘనపరుతును నిన్నే
ప్రేమించే ..................యేసయ్యా
నీవుంటే ...................చాలునయా
నడిపించే ................. నజరేయుడా
కాపాడే .....................కాపరివి         ||నా నీతి||

సంఘమై - నీ స్వాస్థ్యమై - నను నీ యెదుట నిలపాలని
ఆత్మతో - మహిమాత్మతో- నన్ను ముద్రించి యున్నావు నీవు (2)
వరములతో - ఫలములతో - నీకై బ్రతకాలని
తుదిశ్వాస - నీ సన్నిధిలో - విజయం చూడాలని
ఆశతో ఉన్నానయా
కరుణించే.........యేసయ్యా
నీ కోసమే........ నా జీవితం
నిను చేరే ఆశయం తీరాలయ్యా
నిను చూసే.......... ఆక్షణం. రావాలయ్యా ||నా నీతి||

504. Neeve Na Santhosha Ganamu Rakshna Srungamu

నీవే నా సంతోషగానము
రక్షణశృంగము మహాశైలము 
బలశూరుడా యేసయ్యా నా తోడై
ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు ||నీవే||
లార్డ్! యు బి సేవియర్
షో మి సం మెర్సీ
బ్లెస్స్ మి విత్ యువర్ గ్రేస్
సేవియర్! ఫిల్ మి విత్ యువర్ లవ్
విల్ సరెండర్
యు ఆర్ మై కింగ్ గ్లోరి టు జీసస్
త్యాగము ఎరుగని స్నేహమందు
క్షేమము కరువై యుండగా
నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి
నీ ప్రేమతో నన్నాకర్షించినావు 
నిరంతరం నిలుచును నాపై నీ కనికరం
శోధనలైనా బాధలైననూ ఎదురింతు నీ ప్రేమతో 
||నీవే||
వేదన కలిగిన దేశమందు
వేకువ వెలుగై నిలిచినావు
విడువక తోడై అభివృద్ధిపరచి
ఐగుప్తులో సింహాసనమిచ్చినావు 
మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం
అనుదినం అనుక్షణం నీతో నా జీవితం         
||నీవే||
నిర్జీవమైన లోయయందు
జీవాధిపతివై వెలసినావు
దీనశరీరం మహిమ శరీరముగ
నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు 
హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు
హోసన్నా హోసన్నా నీవే మహరాజువు         
||నీవే||

503. Nitho Nenu Nadavalani Nitho Kalisi Undalani


ఆశయ్యా.. చిన్న ఆశయ్యా
యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా
నీతో నేను నడువాలని
నీతో కలిసి ఉండాలని (2)
ఆశయ్యా చిన్న ఆశయ్యా
యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా (2)        ||నీతో||
నడవలేక నేను లోక యాత్రలో
బహు బలహీనుడనైతినయ్యా (2)
నా చేయి పట్టి నీతో నన్ను
నడిపించుమయ్యా నా యేసయ్యా (2)
నీతో నడువాలనినీతో ఉండాలని
చిన్న ఆశయ్యా.. యేసయ్య            ||ఆశయ్యా||
సౌలును పౌలుగా
మార్చిన నా గొప్ప దేవుడా (2)
నీలో ప్రేమా నాలో నింపి
నీలా నన్ను నీవు మార్చుమయ్యా (2)
నీలా ఉండాలనినీతో ఉండాలని
చిన్న ఆశయ్యా.. యేసయ్య            ||ఆశయ్యా||

502. Vandanam Yesayya Vandanam Yesayya

నీవు చేసిన మేళ్లకు
నీవు చూపిన కృపలకు (2)
వందనం యేసయ్యా (4)
ఏపాటివాడనని నేను
నన్నెంతగానో ప్రేమించావు
అంచెలంచెలుగా హెచ్చించి
నన్నెంతగానో దీవించావు (2)         ||వందనం||
బలహీనుడనైన నన్ను
నీవెంతగానో బలపరచావు
క్రీస్తేసు మహిమైశ్వర్యములో
ప్రతి అవసరమును తీర్చావు (2)         ||వందనం||

Tuesday, 25 June 2019

501. Priyamaina Yesayya Premake Rupama

ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా
ప్రియమార నిన్ను చూడనీ
ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా
ప్రియమైన నీతో ఉండనీ
నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా (2)
ఆనందము సంతోషము నీవేనయ్యా
ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడ (2)        ||ప్రియమైన||
జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమ
అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా (2)       ||నా ప్రియుడా||
ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై
ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే (2)       ||నా ప్రియుడా||
ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా
పదములు చాలని ప్రేమకై పరితపించె హృదయం (2)       ||నా ప్రియుడా||

Friday, 6 April 2018

500. Siyonu Patalu Santhoshamuga Paduchu Siyonu Velludamu


       సీయోను పాటలు సంతోషముగను 
       పాడుచు సీయోను వెళ్ళుదము

1.     లోకాన శాశ్వతానంద మేమియు 
       లేదని చెప్పెను ప్రియుడేసు
       పొందవలెనీ లోకమునందు 
       కొంతకాల మెన్నో శ్రమలు

 2.   ఐగుప్తును విడచినట్టి మీరు 
      అరణ్యవాసులె ఈ ధరలో
      నిత్య నివాసము లేదిలలోన 
      నేత్రాలు కానానుపై నిలుపుడి

 3.   మారాను పోలిన చేదైన స్థలముల 
      ద్వారా పోవలసియున్న నేమి
      నీ రక్షకుండగు యేసే నడుపును 
      మారని తనదు మాట నమ్ము

 4.   ఐగుప్తు ఆశలన్నియు విడిచి 
      రంగుగ యేసుని వెంబడించి
      పాడైన కోరహు పాపంబు మాని 
      విధేయులై విరాజిల్లుడి

5.   ఆనందమయ పరలోకంబు మనది 
      అక్కడ నుండి వచ్చునేసు
     సీయోను గీతము సొంపుగ కలసి 
     పాడెదము ప్రభు యేసుకు జై

499. Siyonu Desamulo Cheri Priyunitho Jivinthunu


      సీయోను దేశములో చేరి 
      ప్రియునితో జీవింతును
      జయగీతం బహుఇంపు 
      స్తుతిపాడి సంతోషింతును

1.    నగరపు వీధులలో 
      బంగారము మెరయుచుండును
      రాత్రి పగలు లేవు 
      నా రక్షకుడే వెలుగును

2.   నా కన్నీరంతయు 
     తుడిచివేయునేసు
     కలత లేదక్కడ 
     నా ప్రియునితో ఆనందమే

3.  నిత్యము నా ప్రియుని 
    స్తుతించి పాడెదను
    మహిమా యుతుని దేశములో 
    మహిమతో జీవింతును

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...