నేనంటే ఎంత ప్రేమో ఆ ప్రేమ మూర్తికి
నా కొరకే సిలువనెక్కే నా కలువరినాధునికి
యేసు రక్తమే జయం - సిలువ రక్తమే జయం యి II 4 II
కలువరి రుధిరములో కడుగబడిన శిలను
నీ రక్త ప్రవాహములో సిలువ చెంత చేరాను
నీ ప్రేమే మార్చిందయా... నన్నిలా..
ఆ ప్రేమకు బానిసగా మారానయ్యా II 2 II నేనంటే II
నను రక్షించుటకు నీ ప్రాణమర్పింప
వెనుకాడలేదుగా నా యేసయ్య
నా శిక్ష భరియించి శాపము తొలగించి
నా స్థానములో నీవు బలియైతివా
ప్రియమని ఎంచలేదుగా నీ ప్రాణమును
నా ఆత్మ విలువ నీవు యోచించితివా II 2 II నేనంటే II
ఆరాధన చేతును అన్ని వేళలా....
ఆత్మతో సత్యముతో ఆరాధింతును "2"
నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు ....
నన్ను కన్న తండ్రి నా యేసుకు...... " 2 "
స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధన......
హల్లెలూయ హల్లెలూయ ఆరాధన.... "2"
ఆరాధన .....ఆరాధన..... ఆరాధన..... ఆరాధన...."2"
ఆరాధనా ............ఆరాధనా........... "2"
నీతి సూర్యుడా.. నిజమైన దేవుడా....
సర్వోన్నతుడ ... సర్వ శక్తి మంతుడా... "2"
నీవు తప్ప ఎవరు నాకు లేనె లేరయ్యా
నిను తప్ప వెరేవరిని పూజింతునయా .. "2"
నిత్యము నీ నామమునే స్తుతియించేదను "స్తుతి స్తుతి"
బలవంతుడా జయశీలుడా
మృత్యుంజయుడా నా జీవన దాతా ..."2"
ఉన్నవాడు అనువాడ నీకే స్తోత్రము
సృష్టికర్త సజీవుడ నీకే స్తోత్రము.... "2"
స్తుతి చేయుట నాకెంతో శోభస్కరము .. "2" "స్తుతి స్తుతి"
గతకాలమంత నీ నీడలోన దాచావు దేవా వందనం
కృప చూపి నావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం -2-
పాడనా నీ కీర్తన పొగడనా వేనోళ్లనా -2-
వందనం యేసయ్య ఘనుడవు నీవయ్యా -2- "గత"
ఎన్నెన్నో అవమానాలు ఎదురైననూ
నీ ప్రేమ నన్ను విడిచి పోలేదయా
ఇక్కట్లతో నేను కృంగిననూ
నీ చేయి నన్ను తాకి లేపెనయా -2-
నిజమైన నీ ప్రేమ నిష్కలంకము
నీ విచ్చు హస్తము నిండు ధైర్యము -2- "వందనం"
మాటలే ముళ్ళుగా మారిన వేళ
నీ మాట నన్ను పలకరించెనయా
నిందలతో నేను నిండిన వేల
నీ దక్షిణ హస్తము నన్ను తాకెనయా -2-
నీ మాట చక్కని జీవపు ఊట
మరువనెన్నడు నిన్ను స్తుతియించుట -2- "వందనం"
నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం
నిన్న నేడు నిరంతరం మారని దేవా
ఈ లోకమంత నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం
నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను(2)
ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నను
ఏది నా సొంతం కాదనుకున్నాను (2)
తప్పిపోయిన కుమారుని నేనయితే
నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసూ (2) II ఈ లోకమంతII
ఏ ప్రేమా నీ ప్రేమకు సాటిరాదయ్యా
ఎన్ని ఉన్నా నీతో సరియేదికాదయా (2)
నన్ను మరువని ప్రేమ నీదయ్యా
నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా (2) II ఈ లోకమంతII
విలువేలేని నా జీవితం, నీ చేతిలో పడగానే
అది ఎంతో విలువని నాకు చూపితివే
జీవమే లేని నాలో నీ జీవమును నింపుటకు నీ జీవితాన్నే ధారబోసితివే (2)
నీది శాశ్వత ప్రేమయ
నేను మరచిపోలేనయ
ఎన్ని యుగాలైన - మారదు. ఎండిన ప్రతి మోడును
మరల చిగురించును
నా దేవునికి సమస్తము - సాధ్యమే.... (2)
పాపములో పడిన నన్ను
శాపములో మునిగిన నన్ను
నీ ప్రేమతో. లేపితివే
రోగమే నన్ను చుట్టుకొని యుండగ
రోదనతో ఒంటరినై యుండగ
నా కన్నీటిని. తుడిచితివే (2) II నీది శాశ్వత II
పగలంతా మేఘస్తంభమై,
రాత్రంతా అగ్నిస్తంభమై
దినమంతయు రెక్కలతో కప్పితివే....
స్నేహితులే నన్ను వదిలేసిన
బంధువులే భారమని తలచిన
నా కొరకే బలియైతివే. (2) II నీది శాశ్వత II
సాధ్యమే.. సాధ్యమే... సాధ్యమే నా యేసుకు సమస్తము
సాధ్యమే.. సాధ్యమే... సాధ్యమే నా ప్రియునికి సమస్తము (2)
ఎండిన ప్రతి మోడును
మరల చిగురించును
నా దేవునికి సమస్తము - సాధ్యమే.... (2)
విలువేలేని నా జీవితం, నీ చేతిలో పడగానే
అది ఎంతో విలువని నాకు చూపితివే
జీవమే లేని నాలో నీ జీవమును నుంపుటకు, నీ జీవితాన్నే ధార బోసితివే .
నేను నా ఇంటి వారందరును
మానక స్తుతించెదము (2)
నీ కనుపాప వలె నన్ను కాచి
నేను చెదరక మోసావు స్తోత్రం (2)
ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివే
ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే (2)
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి
స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం ||నేను||
ఎడారిలో ఉన్న నా జీవితమును
మేళ్లతో నింపితివే (2)
ఒక కీడైన దరి చేరక నన్ను
తండ్రిగా కాచావు స్తోత్రం (2) ||ఎబినేజరే||
నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును
నీ కృపతో నింపితివే (2)
నీవు చూపిన ప్రేమను పాడగా
పదములు సరిపోవు తండ్రి (2) ||ఎబినేజరే||
జ్ఞానుల మధ్యలో నను పిలిచిన
నీ పిలుపే ఆశ్చర్యమాశ్చర్యమే (2)
ఒక కీడైన దరి చేరక నన్ను
నీ పాత్రను కానే కాను
కేవలము నీ కృపయే స్తోత్రం (2) ||ఎబినేజరే||