Its a wonderful blog for telugu christian songs. Both Lyrics and Audio/Video available in this blog. you will definitely like this blog.
Wednesday, 7 September 2016
259. Siluve Na Saranayenura
258. Siluvalo Sagindi Yaathra Karunamayuni
257. Siluva Chentha Cherina Nadu
256. Rajulaku Rajaina Ee Mana Vibhuni
రాజులకు రాజైన యీ మన విభుని పూజ సేయుటకు రండి
యీ జయశాలి కన్న మనకింక రాజెవ్వరును లేరని
కరుణ గల సోదరుండై యీయన ధరణి కేతెంచెనయ్యా
స్థిరముగా నమ్ముకొనిన మనకొసగు బరలోక రాజ్యమ్మును
నక్కలకు బొరియలుండె నాకాశ పక్షులకు గూళ్లుండెను
ఒక్కింత స్థలమైనను మన విభుని కెక్కడ లేకుండెను
అపహాసములు సేయుచు నాయన యాననముపై నుమియుచు
గృపమాలిన సైనికు లందరును నెపము లెంచుచు గొట్టిరి
కరమునందొక్క రెల్లు పుడకను దిరముగా నునిచి వారల్
ధరణీపతి శ్రేషుడ నీకిపుడు దండమనుచును మ్రొక్కిరి
ఇట్టి శ్రమలను బొందిన రక్షకుని బట్టుదలతో నమ్మిన
అట్టహాసము తోడను బరలోక పట్టణంబున జేర్చును
శక్తిగల రక్షకుడై మన కొరకు ముక్తి సిద్ధము జేసెను
భక్తితో ప్రార్ధించిన మన కొసగు రక్తితో నా ముక్తిని
త్వరపడి రండి రండి యీ పరమ గురుని యొద్దకు మీరలు
దరికి జేరిన వారిని మన ప్రభువు దరుమడెన్నడు దూరము
255. Yesu Chavonde Siluvapai
యేసు చావొందె సిలువపై నీ కొరకే నా కొరకే
ఎంత గొప్ప శ్రమ నోర్చెను నీ కొరకే నా కొరకే
నదివలె యేసు రక్తము
సిలువలో నుండి ప్రవహించె
పాపము కడిగె మలినంబు తుడిచె
ఆ ప్రశస్త రక్తమే
నే నీ పాపము లొప్పుకో
నీ పాప డాగులు తుడుచుకో
నీ ఆత్మ తనువుల శుద్ధిపరచుకో
క్రీస్తు యేసు రక్తములో
పాప శిక్ష పొంద తగియుంటిమి
మన శిక్ష ప్రభువే సహించెను
నలుగగొట్టబడె పొడువబడె నీకై
అంగీకరించు యేసుని
254. Yesukristuni Siluva Epudu
యేసు క్రీస్తుని సిలువ - ఎపుడు ధ్యానము చేయు
మాసతోను సోదరా = మన దోసంబు నెడబాపు
ఈ సంతాప మరణ - వ్యాసంబుచే సోదరా
ధీరుండై దీనుండై - ధారుణ్య పాప భారంబు
మోసెను సోదరా = తన్ను జేరిన వారిని
పారదోలనని - ఎవరు బల్కిరి సోదరా
ఎండచే గాయములు - మండుచు నుండెను
నిండు వేదన సోదరా = గుండె నుండి నీరుకారు
చుండె దుóఖించుచు - నుండు వేళను సోదరా
ఒళ్లంత రక్తము - ముళ్ళ కిరీటము
తలపై బెట్టిరి సోదరా = ఒకడు బళ్ళెంబుతో బొడవ
నీళ్ళు రక్తము గారె – చిల్లులాయెను సోదరా
కటకటా - పాప సంకటము బాపుట కింత
ఎటులోర్చితివి సోదరా = ఎంతో కఠిన హృదయంబైన
అటు చి తరచినా – కరగిపోవును సోదరా
పంచ గాయములు - నే నెంచి తలంచినా
వంచన యిది సోదరా = నన్ను వంచించు సైతాను
వల నుండి గావ తానెంచి బొందెను సోదరా
మరణమైనప్పుడు - ధరణి వణికెను గుడి
తెర చినిగెను సోదరా = ఉరు గిరులు బండలు బద్ద
లాయె సమాధులు - తెరువ బడెను సోదరా
253. Moodu Siluvalu Mosithiva Nakai
మూడు సిలువలు మోసితివా
నాకై మూడు - సిలువలు మోసితివా
మూడు సిలువలు మోసి మూడిటి వలన
గలుగు - కీడు సహించితివా ఆ కీడు నీ కాళ్ళ
క్రిందవేసి త్రొక్కి ఓడించి వేచితివా
లోక పాపములను - ఏకంబుగా
నీ పైకి వేసికొంటివా = నీకు ఆ
కాడి పెద్దదై - అధిక భారంబాయె
అది మొది సిలువాయెనా
లేని నేరములు నీ - పైన దుష్టులు
వేయగాను క్షమించితివా = నీకు
ఈ నేరములు గూడ - యెంతో భారంబాయె
ఇది రెండవ సిలు వాయెరా
కలుషాత్ములు కర్ర - సిలువ నీపై మోప
అలసిపోయి యుంటివా అట్లు
అలసి పోయిన మోయ - నని చెప్పకుంటివి
అది మూడవ సిలువాయెనా
నా నేరములు యేసు - పైన వేసికొన్న
నీ నెనరునకు స్తోత్రము = నీకు - నేను
చూపు ప్రేమ - నీ ప్రాణార్పణ - ప్రేమ నిధి
యెదుట ఏ మాత్రము
నా ఋణము తీర్చిన - నాదేవా నాప్రభువా
నీ ఋణము తీర్చగలనా = నీవు నా ఋషివై
బోధించి - నా బదులు చనిపోయి - నావని
మరువ గలనా
585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana
తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...
-
మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము ||2|| మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీవంటివారు ఎవరు నీవంటివారు లేరు ||2...
-
నా ప్రాణానికి ప్రాణం - నా జీవానికి జీవం నా హృదయానికి హృదయం నీవే నీవే నా పాదాలకు దీపం నా నావకు తీరం నా పయనానికి గమ్యం నీవే నీవే నా కొండ ...
-
ఆరాధన చేతును అన్ని వేళలా.... ఆత్మతో సత్యముతో ఆరాధింతును "2" నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు .... నన్ను కన్న తండ్రి నా యేసుకు.......