సిలువలో
సాగింది యాత్ర - కరుణామయుని దయగల పాత్ర
ఇది ఎవరికోసమో - ఈ జగతి కోసమే
- ఈ జనుల కోసమే
1. పాలుగారు
దేహముపైన పాపాత్ముల కొరడాలెన్నో
నాట్యమాడినాయి
నడివీధిలో నడిపాయి
నోరు
తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె
ప్రేమ
ఇది ఎవరికోసమో - ఈ జగతి కోసమే
- ఈ జనుల కోసమే
2. చెళ్ళుమని కొట్టింది ఒకరు ఆ మోముపై ఊసింది మరియొకరు
బంతులాడినారు
బాధలలో వేసినారు
నోరు
తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె
ప్రేమ
ఇది ఎవరికోసమో - ఈ జగతి కోసమే
- ఈ జనుల కోసమే
3. వెనుకనుంచి
తన్నింది ఒకరు తనముందు నిలచి
నవ్వింది మరియొకరు
గేలిచేసినారు
పరిహాసమాడినారు
నోరు
తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె
ప్రేమ
ఇది ఎవరికోసమో - ఈ జగతి కోసమే
- ఈ జనుల కోసమే
4. దాహమని
అడిగింది ప్రేమ చేదు దాహాన్ని
ఇచ్చింది లోకం
చిరకనిచ్చినారు
మరి బరిసెతో గుచ్చారు
నోరు
తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె
ప్రేమ
ఇది ఎవరికోసమో - ఈ జగతి కోసమే
- ఈ జనుల కోసమే
No comments:
Post a Comment