About Me

My photo
I’m Gnana Ratnam Veladuti, a devoted Christian sharing devotional messages and sermons in Telugu and English. My goal is to encourage believers to stay strong in faith.

📌 Follow my blog for daily inspiration and spiritual encouragement.

Saturday, 1 February 2020

535. Epatidananaya Nanninthaga Hechinchutaku


ఏపాటి దాననయ నన్నింతగ హెచ్చించుటకు
నేనంతటి దాననయ నాపై కృప చూపుటకు " 2"
నా దోషము భరియించి నా పాపము క్షమియించి
నను నీలా మార్చుటకు కలువరిలో మరణించి " 2"
ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి
కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది
కష్టాల కడలిలో కన్నీటి లోయలలో
నా తోడు నిలిచావు నన్నాదరించావు " 2"
అందరు నను విడచిన నను విడువని యేసయ్యా
విడువను యెడబాయనని నా తోడై నిలచితివా "ప్రేమించే"
నీ ప్రేమను మరువలేనయా నీ సాక్షిగ బ్రతికెదనేసయ్యా
నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంత " 2"
నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయా
నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా "ప్రేమించే"


No comments:

Post a Comment

Yese Nee Adharamu Digulu Chendaku | Telugu Christian Song # 596

✝️ యేసే నీ ఆధారము ✝️ యేసే నీ ఆధారము దిగులు చెందకు మరలా వెనుదిరుగకు ధైర్యముగా ఉండు ఓర్పుతో వేచి ఉండు నూతన బలము ...