About Me

My photo
I’m Gnana Ratnam Veladuti, a devoted Christian sharing devotional messages and sermons in Telugu and English. My goal is to encourage believers to stay strong in faith.

📌 Follow my blog for daily inspiration and spiritual encouragement.

Wednesday, 17 March 2021

Na Brathuku Dinamulu Lekkimpa Nerpumu | Telugu Christian Song #561

నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము
దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము
ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము
నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము ||నా ||

ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి
నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని
ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని
ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని
నా మరణ రోదన ఆలకించుమో ప్రభు
మరల నన్ను నూతనముగ చిగురు వేయని ||నా ||

నీ పిలుపు నేను మరచితి – నా పరుగులో నేనలసితి
నా స్వార్ధము నా పాపము – పతన స్థితికి చేర్చెను
నా అంతమెటుల నుండునో – భయము పుట్టుచున్నది
దేవా నన్ను మన్నించుము – నా బ్రతుకు మార్చుము
యేసూ నీ చేతికి ఇక లొంగిపోదును
విశేషముగా రూపించుము నా శేష జీవితం ||నా ||

1 comment:

Netho Unte Jeevitham | Telugu Christian Song # 595

నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం (2) నువ్వే నా ప్రాణాధారము ఓ…. నువ్వే నా జీవాధారము (2) న...