Wednesday, 31 March 2021

Aadivaramu Udayamu Juda (Easter Song) | Telugu Christian Song #564

ఆదివారము ఉదయము జూడ
లేదు యేసు దేహము జూడ

సిలువ బలిగా - పావన దేహము
విలువగల అత్తరుమయ దేహము
నిలువ నుంచిన యేసు దేహము
మృతులలో లేదు...ఆహా
సమాధినుండి లేచెను - మరణముల్లు విరిచెను

నరుని రూపము - దాల్చిన దేహము
మరణమెుందిన క్రీస్తు దేహము
మరణమును జయించిన దేహము
మృతులలో లేదు...ఆహా
సమాధినుండి లేచెను - మరణముల్లు విరిచెను

మృతులవలెనే - దాచిన దేహము
మృతమునుండి విడిపించు దేహము
మృతులకై బలియైన దేహము
మృతులలో లేదు...ఆహా
సమాధినుండి లేచెను - మరణముల్లు విరిచెను


1 comment:

స్థిరపరచువాడవు | ఏమైనా చేయగలవు | Telugu Christian Song #594

స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొ...