Friday, 11 June 2021

567. Snehamai Pranamai Varinche Daivama

స్నేహమై, ప్రాణమై వరించే దైవమై
ఇదే జీవితం, నీకే అంకితం
ఇదే నా వరం, నీవే అమృతం
నిరంతరం సేవించనీ

జగతిన వెలసి , మనసున నిలచి
కోరె నన్ను దైవము (2)
లోకమందు జీవమాయె - చీకటందు దీపమాయె
పలకరించే నేస్తమాయె - కనికరించే బంధమాయె
ఎంత ప్రేమ యేసయా - నన్ను నీలో జీవించనీ

తలపున కొలువై - మనవుల బదులై
చేరె నన్ను నిరతము (2)
కలతలన్నీ కరిగిపోయే - భారమంతా తొలగిపోయే
ఆపదందు క్షేమమాయె - తరిగిపోని భాగ్యమాయే
ఎంత ప్రేమ యేసయా - నన్ను నీలో తరియించనీ

566. Pade Padana Ninne Korana

పదే పాడనా నిన్నే కోరనా - ఇదే రీతిగా నిన్నే చేరనా
నీ వాక్యమే నాకుండగా - నా తోడుగా నీవుండగా
ఇదే బాటలో నే సాగనా - ఇదే రీతిగా నా యేసయ్య

ప్రేమను పంచే నీ గుణం - జీవమునింపే సాంత్వనం
మెదిలెను నాలో నీ స్వరం - చూపెను నాకు ఆశ్రయం
నీవే నాకు ప్రభాతము - నాలో పొంగే ప్రవాహము
నీవే నాకు అంబరం - నాలో నిండే సంబరం
నాలోన మిగిలే నీ ఋణం - నీతోటి సాగే ప్రయాణం

మహిమకు నీవే రూపము - మధురము నీదు నామము
ఇదిగో నాదు జీవితం - ఇలలో నీకే అంకితం
నీవే నాకు సహాయము - నిన్న నేడు నిరంతరం
నీవే నాకు ఆశయం - నాలో నీకే ఆలయం
ధరలోన లేరు నీ సమం - నీ ప్రేమధారే నా వరం

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...