Friday, 11 June 2021

Snehamai Pranamai Varinche Daivama | Telugu Christian Song #567

స్నేహమై, ప్రాణమై వరించే దైవమై
ఇదే జీవితం, నీకే అంకితం
ఇదే నా వరం, నీవే అమృతం
నిరంతరం సేవించనీ

జగతిన వెలసి , మనసున నిలచి
కోరె నన్ను దైవము (2)
లోకమందు జీవమాయె - చీకటందు దీపమాయె
పలకరించే నేస్తమాయె - కనికరించే బంధమాయె
ఎంత ప్రేమ యేసయా - నన్ను నీలో జీవించనీ

తలపున కొలువై - మనవుల బదులై
చేరె నన్ను నిరతము (2)
కలతలన్నీ కరిగిపోయే - భారమంతా తొలగిపోయే
ఆపదందు క్షేమమాయె - తరిగిపోని భాగ్యమాయే
ఎంత ప్రేమ యేసయా - నన్ను నీలో తరియించనీ

1 comment:

స్థిరపరచువాడవు | ఏమైనా చేయగలవు | Telugu Christian Song #594

స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొ...