Friday, 18 July 2025

590. El Roi vai nanu chudaga

ఎల్ రోయి వై నను చూడగా
నీ దర్శనమే నా బలమాయెను
ఎల్ రోయి వై నీవు నను చేరగా
నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను

నీ ముఖ కాంతియే నా ధైర్యము
నీ ముఖ కాంతియే నా బలము

మరణమే నన్నావరించగా
నీ వాక్యమే నాతో నిలిచెను
ఎల్ రోయి వై నను చూడగా
శత్రువే సిగ్గు నొందెను " నీ ముఖ "

విశ్వాసమే శోధింపబడగా
నీ కృపయే నాతో నిలిచెను
ఎల్ రోయి వై నను చూడగా
శత్రు ప్రణాళిక ఆగిపోయెను " నీ ముఖ "

ఒంటరినై నేను నిను చేరగా
నా పక్షమై నీవు నిలచితివే
ఎల్ రోయి వై నను చూడగా
శత్రువే పారిపోయెను " నీ ముఖ "

589. Sharonu Rojave Na Prana Snehame

షారోను రోజావే - నా ప్రాణ స్నేహమే
నిర్దోష రక్తమే - దైవ గొర్రెపిల్లవే

సుందరుడవు - నీవు సుందరుడవు
పదివేలలో నీవు శ్రేష్టుడవు
సుందరుడవు - బహు సుందరుడవు
పదివేలలో అతిశ్రేష్టుడవు

స్నేహితులు మరచిపోయినా
బంధువులే విడిచిపోయినా
తోడుగా నిలిచిన ప్రేమను మరువలేనే
సహచారివే సహచారివే వేదనలో
ఆదరించే నా ప్రియుడవే

రోగపు పడకలోన
నిరీక్షణ కోల్పోయినా
నను తాకి స్వస్థపరచిన వైద్యుడవే
పరిహారివే - పరిహారివే
నా వ్యాధులు భరియించిన యేసువే

588. Balamaina Devudavu Balavanthudavu Neevu

బలమైన దేవుడవు - బలవంతుడవు నీవు
శూన్యములో సమస్తమును నిరాకారములో ఆకారాము
సృజియించినావు నీవు సర్వ సృష్టి కర్తవు నీవు (2)

హల్లెలూయా........హల్లెలూయా (2)
హల్లెలూయా........హల్లెలూయా హోసన్న
హల్లెలూయా........హల్లెలూయా

1. ఎల్‌ ఓలామ్‌ (4)
అల్పా ఓమెగయూ, నిత్యుడైన దేవుడవు (2)
నిత్యనిబంధన చేశావు నిబంధననె స్థిరపరిచావు
నిన్నానేడు రేపు మారని దేవుడవు నీవు(2) ||హల్లెలూయా||

2. ఎల్‌ షద్దాయ్‌ (4)
పోషించు దేవుడవు ఆశ్రయ దుర్గము నీవు (2)
రెక్కలపై మోసెడి వాడా - రక్షణ శృంగము నీవేగా
నీ మాటున దాచె దేవా మాటను నెరవేర్చేదేవా (2) ||హల్లెలూయా||

3. అడోనాయ్‌ (4)
ప్రభువైన దేవుడవు -ప్రభువులకు ప్రభువు నీవు (2)
సర్వాధికారివి నీవు - సకల జనులకు ప్రభువు నీవు
నీవే నాకు ప్రభువు -నీవేనా యజమానుడవు (2) ||హల్లెలూయా||

Monday, 14 July 2025

587. Nannu Chuchuvada

నన్ను చూచువాడా నిత్యం కాచువాడా (2)
పరిశోధించి తెలుసుకున్నావు
చుట్టూ నన్ను ఆవరించావు
కూర్చుండుట నే లేచియుండుట
" బాగుగ యెరిగియున్నావు- రాజా

తలంపులు తపనయు అన్నీ
అన్నియు యెరిగియున్నావు
నడచిననూ పడుకున్ననూ
అయ్యా! నీవెరిగియున్నావు
ధన్యవాదం యేసు రాజా (2)

వెనుకను ముందును కప్పి
చుట్టూ నన్ను ఆవరించావు
(నీ) చేతులచే అనుదినము
పట్టి నీవే నడిపించావు
ధన్యవాదం యేసు రాజా (2)

పిండమునై యుండగా నీ కన్నులకు
మరుగై నేనుండలేదయ్యా
విచిత్రముగా నిర్మించితివి
ఆశ్చర్యమే కలుగుచున్నది
ధన్యవాదం యేసు రాజా (2)

590. El Roi vai nanu chudaga

ఎల్ రోయి వై నను చూడగా నీ దర్శనమే నా బలమాయెను ఎల్ రోయి వై నీవు నను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను నీ ముఖ కాంతియే నా ధైర్యము నీ మ...