Monday, 14 July 2025

587. Nannu Chuchuvada

నన్ను చూచువాడా నిత్యం కాచువాడా (2)
పరిశోధించి తెలుసుకున్నావు
చుట్టూ నన్ను ఆవరించావు
కూర్చుండుట నే లేచియుండుట
" బాగుగ యెరిగియున్నావు- రాజా

తలంపులు తపనయు అన్నీ
అన్నియు యెరిగియున్నావు
నడచిననూ పడుకున్ననూ
అయ్యా! నీవెరిగియున్నావు
ధన్యవాదం యేసు రాజా (2)

వెనుకను ముందును కప్పి
చుట్టూ నన్ను ఆవరించావు
(నీ) చేతులచే అనుదినము
పట్టి నీవే నడిపించావు
ధన్యవాదం యేసు రాజా (2)

పిండమునై యుండగా నీ కన్నులకు
మరుగై నేనుండలేదయ్యా
విచిత్రముగా నిర్మించితివి
ఆశ్చర్యమే కలుగుచున్నది
ధన్యవాదం యేసు రాజా (2)

No comments:

Post a Comment

590. El Roi vai nanu chudaga

ఎల్ రోయి వై నను చూడగా నీ దర్శనమే నా బలమాయెను ఎల్ రోయి వై నీవు నను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను నీ ముఖ కాంతియే నా ధైర్యము నీ మ...