మంచి దేవుడు నా యేసయ్యా
చింతలన్ని బాపునయ్యా
హృదయ వాంఛతో చేరిన వారికి
శాంతి జీవము ఇచ్చునయ్యా (2)
మహిమా ఘనతా ప్రభావము నీకే (2)
కృపల వెంట కృపను చూపి
విడువక నీ కృపలను చూపిన (2)
కృపగల నా యేసు రాజా
నీ కృప నాకు చాలునయ్యా (2) ||మహిమా||
మహిమ వెంట మహిమ నొసగి
నీ రూపమున నన్ను మార్చి (2)
మహిమలో నీవుండు చోటుకి
మమ్ము ప్రేమతో పిలచితివి (2) ||మహిమా||
జయము వెంట జయమునిచ్చి
జయ జీవితము మాకు ఇచ్చి (2)
జయశీలుడు నా యేసు ప్రభువని
జయము జయమని పాడెదను (2) ||మహిమా||