Friday, 5 August 2016

138. Oohinchaleni Melulatho Nimpina Yesayya

ఊహించలేని మేలులతో నింపిన
నా యేసయ్యా నీకే నా వందనం (2)
వర్ణించగలనా నీ కార్యముల్
వివరించగలనా నీ మేలులన్ (2)       ||ఊహించలేని||

మేలుతో నా హృదయం తృప్తిపరచినావు
రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును (2)
ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా
స్తుతియింతును నీ నామమున్ (2)     ||ఊహించలేని||

నా దీనస్థితిని నీవు మార్చినావు
నా జీవితానికి విలువనిచ్చినావు (2)
నీ కృపకు నన్ను ఆహ్వానించినావు
నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2)   ||ఊహించలేని||

137. Udayamayenu Hrudayama Prabhu Yesuni Prardhinchave

ఉదయమాయె హృదయమా
ప్రభు యేసుని ప్రార్ధించవే (2)
పదిలముగా నిను వదలకుండా
పడక నుండి లేపెనే (2)        ||ఉదయమాయె||

రాత్రి గడచిపోయెనే
రవి తూర్పున తెలవారెనే (2)
రాజా రక్షకుడేసు దేవుని
మహిమతో వివరించవే (2)        ||ఉదయమాయె||

తొలుత పక్షులు లేచెనే
తమ గూటి నుండి స్తుతించెనే (2)
తండ్రి నీవే దిక్కు మాకని
ఆకాశమునకు ఎగిరెనే (2)        ||ఉదయమాయె||

పరిశుద్ధుడా పావనుండా
పరంధాముడా చిరంజీవుడా (2)
పగటియంతయు కాచి మము
పరిపాలించుము దేవుడా (2)        ||ఉదయమాయె||

తండ్రి దాతవు నీవని
ధరయందు దిక్కు ఎవరని (2)
రాక వరకు కరుణ చూపి
కనికరించి బ్రోవుమా (2)        ||ఉదయమాయె||

136. Inthakalam Nidu Krupalo Kachina Deva

ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2)
ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2)

ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా (2)
మారని వీడని ప్రేమే నీదయ్యా
మార్చిన నా జీవితం నీకే యేసయ్యా (2)       

నీవు చేసిన మేళ్లను – తలచుకొందును అనుదినం (2)
నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా
వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా (2)         

దూరమైతిరి ఆప్తులు – విడచిపోతిరి నా హితుల్ (2)
శోధన వేదన తీర్చిన యేసయ్యా
తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా (2)          

135. Halleluya Halleluya... Na Daggara Undumu O Yesayya

హల్లెలూయ  హల్లెలూయ
హల్లెలూయ  హల్లెలూయ
నా దగ్గర ఉండుము ఓ యేసయ్యా
నే నిన్ను విడిచి ఉండలేనయ్యా

 1. కన్నీటి సమయములో తల్లివి నీవయ్య
సమస్యల సమయములో తండ్రివి నీవయ్య
నా దగ్గర ఉండుము ఓ యేసయ్యా
నే నిన్ను విడిచి ఉండలేనయ్యా
హల్లెలూయ హల్లెలూయ

 2. రోగము సమయములో వైద్యుడ నీవయ్యా
మరణము సమయములో జీవము నీవయ్యా
నా దగ్గర ఉండుము ఓ యేసయ్యా
నే నిన్ను విడిచి ఉండలేనయ్యా
హల్లెలూయ హల్లెలూయ

134. Stuthi Simhasanasinuda Athyantha Premamayuda

స్తుతి సింహాసనాసీనుడా అత్యంత ప్రేమామయుడా ||2||
పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా ||2||
ఆరాధనా నీకే ||2||
ఆరాధనా నీకే.. ఆరాధనా నీకే.. ||2||
ఆరాధనా నీకే ||2||

1. ఆశ్చర్యకరుడ ఆలోచన కర్త బలవంతుడగు దేవా నిత్యుడగు తండి ||2||
సమాధాన కర్తయగు అధిపతి నీవే ఆరాధనా నీకే ||2||
ఆరాధనా నీకే.. ఆరాధనా నీకే.. ||2||
ఆరాధనా నీకే ||2||

 2. మా రక్షణకర్త మారని మా దేవా మాలోన
వసియించు మహిమా స్వరూప ||2||
మహిమా ఘనతా ప్రభావము నీకే ఆరాధన నీకే   ||2||
ఆరాధనా నీకే.. ఆరాధనా నీకే.. ||2||
ఆరాధనా నీకే ||2||

133. Subhavela Stothrabali Thandri Deva Nikenayya

శుభవేళ స్తోత్రబలి - తండ్రిదేవా నీకేనయ్యా
ఆరాధన స్తోత్రబలి  నీకేనయ్యా
తండ్రిదేవా నీకే నయ్యా ||2||

  1 ఎల్‌షడా ఎల్‌షడా - సర్వశక్తిమంతుడా ||2||
సర్వశక్తిమంతుడా - ఎల్‌షడా ఎల్‌షడా ||శుభవేళ||

  2 ఎల్‌రోయి ఎల్‌రోయి - నన్నిల చూచువాడ ||2||
నన్నిల చూచువాడ - ఎల్‌రోయి ఎల్‌రోయి ||శుభవేళ||

  3. యెహోవా షమ్మా నాతో ఉన్నవాడా ||2||
నాతో ఉన్నవాడా - యెహోవా షమ్మా ||శుభవేళ||

4. యెహోవా షాలోమ్‌ - శాంతినొసగువాడా ||2||
శాంతినొసగువాడా - యెహోవా షాలోమ్‌ ||శుభవేళ||

132. Lokamulo Unnavani Kante Na Yesu Goppavadu

లోకములో ఉన్నవాని కంటే
నా యేసు గొప్పవాడు ||2||
నాయేసు గొప్పవాడు నాయేసు గొప్పవాడు
నాయేసు గొప్పవాడు ఆ....ఆ...
నా యేసు గొప్పవాడు నా యేసు గొప్పవాడు
నా యేసు గొప్పవాడు

లోకములో ఉన్నవాని కంటే
నాయేసు పూజనీయుడు
నాయేసు పూజనీయుడు నాయేసు పూజనీయుడు
నాయేసు పూజనీయుడు ఆ....ఆ...
నా యేసు పూజనీయుడు నా యేసు పూజనీయుడు
నా యేసు పూజనీయుడు

లోకములో ఉన్నవాని కంటే
నాయేసు సుందరుడు
నాయేసు సుందరుడు నాయేసు సుందరుడు
నాయేసు సుందరుడు ఆ....ఆ...
నాయేసు సుందరుడు నాయేసు సుందరుడు
నాయేసు సుందరుడు

లోకములో ఉన్నవాని కంటే
నాయేసు నీతిమంతుడు
నాయేసు నీతిమంతుడు నాయేసు నీతిమంతుడు
నాయేసు నీతిమంతుడు ఆ....ఆ...
నా యేసు నీతిమంతుడు నా యేసు నీతిమంతుడు
నా యేసు నీతిమంతుడు

లోకములో ఉన్నవాని కంటే
నాయేసు పరిశుద్ధుడు
నాయేసు పరిశుద్ధుడు నాయేసు పరిశుద్ధుడు
నాయేసు పరిశుద్ధుడు ఆ....ఆ...
నా యేసు పరిశుద్ధుడుు నా యేసు పరిశుద్ధుడు
నా యేసు పరిశుద్ధుడు

లోకములో ఉన్నవాని కంటే
నాయేసు మంచివాడు  
నాయేసు మంచివాడు నాయేసు మంచివాడు
నాయేసు మంచివాడు ఆ....ఆ...
నా యేసు మంచివాడు నా యేసు మంచివాడు
నా యేసు మంచివాడు

లోకములో ఉన్నవాని కంటే
నాయేసు శక్తిమంతుడు
నాయేసు శక్తిమంతుడు నాయేసు శక్తిమంతుడు
నాయేసు శక్తిమంతుడు ఆ....ఆ...
నా యేసు శక్తిమంతుడు నా యేసు శక్తిమంతుడు
నా యేసు శక్తిమంతుడు

లోకములో ఉన్నవాని కంటే
నాయేసు బలవంతుడు
నాయేసు బలవంతుడు నాయేసు బలవంతుడు
నాయేసు బలవంతుడు ఆ....ఆ...
నా యేసు బలవంతుడు నా యేసు బలవంతుడు
నా యేసు బలవంతుడు

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...