ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2)
ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2)
ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా (2)
మారని వీడని ప్రేమే నీదయ్యా
మార్చిన నా జీవితం నీకే యేసయ్యా (2)
నీవు చేసిన మేళ్లను – తలచుకొందును అనుదినం (2)
నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా
వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా (2)
దూరమైతిరి ఆప్తులు – విడచిపోతిరి నా హితుల్ (2)
శోధన వేదన తీర్చిన యేసయ్యా
తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా (2)
No comments:
Post a Comment