Friday, 5 August 2016

137. Udayamayenu Hrudayama Prabhu Yesuni Prardhinchave

ఉదయమాయె హృదయమా
ప్రభు యేసుని ప్రార్ధించవే (2)
పదిలముగా నిను వదలకుండా
పడక నుండి లేపెనే (2)        ||ఉదయమాయె||

రాత్రి గడచిపోయెనే
రవి తూర్పున తెలవారెనే (2)
రాజా రక్షకుడేసు దేవుని
మహిమతో వివరించవే (2)        ||ఉదయమాయె||

తొలుత పక్షులు లేచెనే
తమ గూటి నుండి స్తుతించెనే (2)
తండ్రి నీవే దిక్కు మాకని
ఆకాశమునకు ఎగిరెనే (2)        ||ఉదయమాయె||

పరిశుద్ధుడా పావనుండా
పరంధాముడా చిరంజీవుడా (2)
పగటియంతయు కాచి మము
పరిపాలించుము దేవుడా (2)        ||ఉదయమాయె||

తండ్రి దాతవు నీవని
ధరయందు దిక్కు ఎవరని (2)
రాక వరకు కరుణ చూపి
కనికరించి బ్రోవుమా (2)        ||ఉదయమాయె||

3 comments:

Sarvadhikariyaina Sarva Sakthimanthudu | Telugu Christian Song # 604

ఏదైనా సాధ్యమే | Telugu Christian Song ✨ ఏదైనా సాధ్యమే ✨ సర్వాధికారియైన సర్వశక్తిమంతుడు అధిక ప్రేమామయ...

About Me

My photo
I’m Gnana Ratnam Veladuti, a devoted Christian sharing devotional messages and sermons. My goal is to encourage believers to stay strong in faith.

📌 Follow my blog for daily inspiration and spiritual encouragement.