Friday, 5 August 2016

145. Nakenno Melulu Chesithivi Nikemo Arpinthunu

నాకెన్నో మేలులు చేసితివే
నీకేమి  అర్పింతును – దేవా నీకేమి చెల్లింతును (2)
హల్లెలూయా యేసునాథా–కృతజ్ఞతా స్తుతులివే (2)  

కృప చేత నన్ను రక్షించినావే
కృప వెంబడి కృపతో – నను బలపరచితివే
నన్నెంతగానో ప్రేమించినావే
నా పాపమును కడిగి – పరిశద్ధపరచితివే (2)  ||హల్లె||

నా జీవితాశలు లేవనుకొనగా
నా ఆశ నీవైతివే – ఆశలు తీర్చితివే
నలుదిశల నన్ను భయమావరింప
నా పక్షమందుంటివే – నాకభయమిచ్చితివే (2) ||హల్లె||

నా కాడి మోసి నా తోడు నీవే
నీ చేతి నీడలో – నను దాచియున్నావే
ఏ కీడు నాకు రాకుండ చేసి
నీ జాడలో నన్ను- నడిపించుచున్నావే (2)    ||హల్లె||

నీ రాజ్యమందు నను చేర్చుకొందువు
రానున్న రారాజువు – నా రాజువు నీవు
నీ వధువు సంఘమున నను చేర్చుకొన్నావు
నను కొన్నవాడవు – నా వరుడవు నీవు (2) ||హల్లె||

144. Na Nithi Nive Na Khyathi Nive

నా నీతి నీవే నా ఖ్యాతి నీవే
నా దైవమా యేసయ్యా
నా క్రియలు కాదు నీ కృపయే దేవా
నా ప్రాణమా యేసయ్యా
నదులంత తైలం విస్తార బలులు
నీకిచ్చినా చాలవయ్యా
నీ జీవితాన్నే నాకిచ్చినావు
నీకే నా జీవమయ్యా
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ (4)       ||నా నీతి||

నా దీన స్థితిని గమనించి నీవు
దాసునిగ వచ్చావుగా
నా దోష శిక్ష భరియించి నీవు
నను నీలో దాచావుగా
ఏమంత ప్రేమ నా మీద నీకు
నీ ప్రాణమిచ్చావుగా
నీ రక్తమిచ్చి కొన్నావు నన్ను
యజమానుడవు నీవేగా                         ||హల్లెలూయ||

నా ప్రియులే నన్ను వెలివేసినప్పుడు
నీవు చేరదీసావుగా
నా ప్రక్క నిలిచి నను ధైర్యపరచి
కన్నీరు తుడిచావుగా
నేనున్న నీకు భయమేలనంటూ
ఓదార్పునిచ్చావుగా
చాలయ్య దేవ నీ కృపయే నాకు
బ్రతుకంతయు పండుగా                          ||హల్లెలూయ||

ఆ ఊభిలోనా నే చిక్కినప్పుడు
నీవు నన్ను చూసావుగా
నీ చేయి చాపి నను పైకి లేపి
నీ వాక్కునిచ్చావుగా
నా సంకటములు నా ఋణపు గిరులు
అన్నిటిని తీర్చావుగా
నీలోన నాకు నవ జీవమిచ్చి
నీ సాక్షిగా నిలిపావుగా                          ||హల్లెలూయ||

143. Na Kanula Vembadi Kanniru Raniyaka

నా కనుల వెంబడి కన్నీరు రానీయక
నా ముఖములో దుఖమే ఉండనీయక

చిరునవ్వుతో నింపినా యేసయ్యా (2)
ఆరాధనా ఆరాధనా నీకే (4)                      ||నా కనుల||

అవమానాలను ఆశీర్వాదముగా
నిందలన్నిటిని దీవెనలుగా మార్చి (2)
నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై (2)      ||చిరు||

సంతృప్తి లేని నా జీవితములో
సమృద్ధినిచ్చి ఘనపరచినావు (2)
నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి (2)  ||చిరు||


142. Gadachina Kalamu Krupalo Mammu Dachina Deva

హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (2)
గడచిన కాలము కృపలో మమ్ము
దాచిన దేవా నీకే స్తోత్రము
పగలూ రేయి కనుపాపవలె
కాచిన దేవా నీకే స్తోత్రము (2)
మము దాచిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన దేవా నీకే స్తోత్రము (2)        ||గడచిన||

కలత చెందిన కష్టకాలమున
కన్న తండ్రివై నను ఆదరించిన
కలుషము నాలో కానవచ్చినా
కాదనక నను కరుణించిన (2)
కరుణించిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన దేవా నీకే స్తోత్రము (2)       ||గడచిన||

లోపములెన్నో దాగి ఉన్నను
ధాతృత్వముతో నను నడిపించినా
అవిధేయతలే ఆవరించినా
దీవెనలెన్నో దయచేసిన (2)
దీవించిన దేవా నీకే స్తోత్రము
దయచూపిన తండ్రి నీకే స్తోత్రము (2)        ||గడచిన||


141. Kuthuhalamarbatame Na Yesuni Sannidhilo

కుతూహలం ఆర్భాటమే – నా యేసుని సన్నిధిలో
ఆనందమానందమే – నా యేసుని సన్నిధిలో (2)         

పాపమంత పోయెను – రోగమంత పోయెను
యేసుని రక్తములో
క్రీస్తునందు జీవితం – కృప ద్వారా రక్షణ
పరిశుద్ధ ఆత్మలో (2)                  ||కుతూహలం ||

దేవాది దేవుడు – ప్రతిరోజు నివసించు
దేవాలయం నేనే
ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను 
అద్భుత మద్భుతమే (2)            ||కుతూహలం||

శక్తినిచ్చు యేసు – జీవమిచ్చు యేసు
జయంపై జయం ఇచ్చును
ఏకముగా కూడి – హోసన్నా పాడి
ఊరంతా చాటెదము (2)              ||కుతూహలం||

బూరధ్వనితో పరిశుద్ధులతో
యేసు రానైయుండే
ఒక్క క్షణములోనే - రూపాంతరము పొంది
మహిమలో ప్రవేశిద్దాం (2)              ||కుతూహలం||

140. Emundi Nalo Ni Parisudhatha Lede

ఏముంది నాలో - నీ పరిశుద్ధత లేదే
అయినా నను ప్రేమించితివే
ఎందుకో ఈ ఘోరపాపిని చేర దీశావు ప్రభువా
ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే 
అయినా నను ప్రేమించితివే 
అయినను నన్ను ప్రేమించావు
కరుణించావు నన్ను మురిపించావు

1. అన్యాయపు తీర్పు పొందావు నాకై అపహాస్యం భరియించావు
ఆదరణ కరువై బాధింపబడియు నీ నోరు తెరువ లేదే
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
నీ త్యాగమే నన్ను బ్రతికించింది ||ఏముంది||

2. ఉమ్మిరి నీదు మోముపైన నా కోసం భరియించావు
గుచ్చిరి శిరమునే ముండ్ల మకుాన్ని నా కోసం ధరియించావు
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
నీ త్యాగమే నన్ను బ్రతికించింది ||ఏముంది||

139. Ella velalandu Kasta Kalamandu

ఎల్లవేళలందు – కష్టకాలమందు
వల్లభుండా యేసున్‌ స్తుతింతున్‌
ఎల్లను నీవే నా కెల్లెడల
వల్లపడదే వివరింపన్‌ (2)

విమోచకుడా – విమోచన నీవే
రక్షకుడవు – నా రక్షణ నీవే (2)        ||ఎల్ల||

సృష్టికర్తవు – సహాయము నీవే
ఇష్టుడ నీవు – త్రిత్వము నీవే (2)    ||ఎల్ల||

జ్ఞానము నీవే – నా పానము నీవే
దానము నీవే – నా గానము నీవే (2)  ||ఎల్ల||

జ్యోతివి నీవే – నా నీతివి నీవే
ఆదియు నీవే – నా అంతము నీవే (2) ||ఎల్ల||

నిత్యుడ నీవే – నా సత్యుండ నీవే
స్తోత్రము నీవే – నా నేత్రము నీవే (2)  ||ఎల్ల||

జీవము నీవే – నా దేవుడవు నీవే
పావన నీవే – నా కావలి నీవే (2)      ||ఎల్ల||

కాంతియు నీవే – నా శాంతియు నీవే
సంతస నీవే – నాకంతయు నీవే (2)   ||ఎల్ల||

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...