కుతూహలం ఆర్భాటమే – నా యేసుని సన్నిధిలో
ఆనందమానందమే – నా యేసుని సన్నిధిలో (2)
పాపమంత పోయెను – రోగమంత పోయెను
యేసుని రక్తములో
క్రీస్తునందు జీవితం – కృప ద్వారా రక్షణ
పరిశుద్ధ ఆత్మలో (2) ||కుతూహలం ||
దేవాది దేవుడు – ప్రతిరోజు నివసించు
దేవాలయం నేనే
ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను
అద్భుత మద్భుతమే (2) ||కుతూహలం||
శక్తినిచ్చు యేసు – జీవమిచ్చు యేసు
జయంపై జయం ఇచ్చును
ఏకముగా కూడి – హోసన్నా పాడి
ఊరంతా చాటెదము (2) ||కుతూహలం||
బూరధ్వనితో పరిశుద్ధులతో
యేసు రానైయుండే
ఒక్క క్షణములోనే - రూపాంతరము పొంది
మహిమలో ప్రవేశిద్దాం (2) ||కుతూహలం||
No comments:
Post a Comment