Monday, 8 August 2016

173. Ni Premaku Sati Leneledu

నీ ప్రేమకు సాటి లేనే లేదు
ప్రేమారూపా యేసురాజా (2)

నింగియందునా – నేల యందునా
పాతాళమందునా – ఎందైన గాని (2)
నీకన్నా అధికులు ఎవరు లేనే లేరు         ||నీ ప్రేమకు||

పాపినైన నా కొరకు – పరలోకం విడచినదెవరు
నా పాపముల కొరకై – సిలువలో మరణించినదెవరు (2)
క్షమియించి రక్షించిన నా తండ్రి నీవే         ||నీ ప్రేమకు||

ధరలోని ధన ధాన్యములు – నన్ను వీడినా
ఇలలో నా సరివారు – త్రోసివేసినా (2)
ఇహమందు పరమందు నా ధనము నీవే ||నీ ప్రేమకు||

172. Ni Prema Ni Karuna Chalunaya

నీ ప్రేమా నీ కరుణా చాలునయ్యా నా జీవితాన
మరి దేనిని ఆశించను నే కోరను ఈ జగాన
చాలయ్య చాలీ దీవెనలు చాలు
మేలయ్య మేలు నీ సన్నిధి మేలు (2)

గురిలేని నన్ను గుర్తించినావే
ఎనలేని ప్రేమను చూపించినావే
వెలలేని నాకు విలువిచ్చినావే
విలువైన పాత్రగా నను మార్చినావే         ||నీ ప్రేమా||

చేజారిన నాకై చేచాచినావే
చెదరిన నా బ్రతుకును చేరదీసినావే
చెరనుండి నన్ను విడిపించినావే
చెరగని నీ ప్రేమకు సాక్షిగ మార్చావే        ||నీ ప్రేమా||

నరకపు పొలిమేరలో నను కనుగొన్నావే
కల్వరిలో ప్రాణమిచ్చి నను కొన్నావే
నీ ప్రేమను ప్రకటింప నను ఎన్నుకొన్నావే
నీ కుమారునిగా నను మార్చినావే          ||నీ ప్రేమా||

171. Ni Prema Enth Madhuram

నీ ప్రేమ ఎంతో మధురం యేసు
నీ ప్రేమకు ఎవరు సాటిలేరు ప్రభు
సముద్రము కంటే లోతైనది
శిఖరము కంటే ఎత్తైనది
నీది శాశ్వతమైన ప్రేమ

పాపపు స్థితిలో నేనుండగా - నీదు రక్తముతో కడిగితివి
దేవా నీదు ఆత్మతో నింపితివి - నీతిమంతునిగా చేసితివి
నను రక్షించిన దేవా - నను క్షమించిన దేవా

కృంగిన స్థితిలో నేనుండగా నీదు ప్రేమతో లేపితివి
దేవా నీదు కృపలో నిలిపితివి - బంధకములను విరచితివి
నను రక్షించిన దేవా - నను బలపరచిన దేవా

నన్ను అందరు విడనాడినా - నీ కౌగిలో చేర్చితివి
దేవా నీదు రక్షణ నిచ్చితివి - తండ్రి దరికి నను చేర్చితివి
నను రక్షించిన దేవా - నను ఎడబాయని దేవా

Saturday, 6 August 2016

170. Ni Prema Entho Entho Madhuram Yesu Ni Prema

నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం
యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం
యేసయ్య మధురాతి మధురం యేసయ్యా.. IIనీ ప్రేమII

తల్లికుండునా నీ ప్రేమ
సొంత చెల్లికుండునా నీ ప్రేమ
అన్నకుండునా నీ ప్రేమ
కన్న తండ్రికుండునా నీ ప్రేమ                    IIనీ ప్రేమII

శాంతమున్నది నీ ప్రేమలో
దీర్ఘశాంతమున్నది నీ ప్రేమలో
బలమున్నది నీ ప్రేమలో
గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో                IIనీ ప్రేమII

నాకై సిలువనెక్కెను నీ ప్రేమ
నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ
నాకై మరణించెను నీ ప్రేమ
నాకై తిరిగిలేచెను నీ ప్రేమ                         IIనీ ప్రేమII

మర్చిపోనిది నీ ప్రేమ
నను మార్చుకున్నది నీ ప్రేమ
కనురెప్పలాంటిది నీ ప్రేమ
చిరకాలముండును నీ ప్రేమ                     IIనీ ప్రేమII

169. Ni Prema Entho Aparamu Varnimpatharama Na Prabhu

నీ ప్రేమ ఎంతో అపారము వర్ణింపతరమా నా ప్రభూ
పులకింప చేసెను నా హృది హృదయేశ్వరా నా యేసువా

నన్ను ఎంతో ప్రేమించి నాదు పాపమె క్షమియించి
కృప కనికరముల నీడలో - నన్ను చేర్చిన నా ప్రభూ
జీవితమంతా స్తుతియించినా - తీరునా నీ ఋణం

నీదు సన్నిధిలో కాంక్షించి - పాప బ్రతుకే వీడితిని
నీదు జీవమె నిండుగ - నాలో నింపుము నా ప్రభు
జీవితమంతా నీ ప్రేమనూ - చాటుచు నుందును

సముద్రము కంటె లోతైనది - గగనము కంటె ఎత్తైనది
మరణము కంటె బలీయము - శాశ్వతమైనది నీ ప్రేమ
నీదు ప్రేమా నా ప్రభూ - మరువగ సాధ్యమా

168. Ni Jaldaru Vrukshapu Nidalalao

నీ జల్దరు వృక్షపు నీడలలో
నేనానంద భరితుడనైతిని 
బలు రక్కసి వృక్షపు గాయములు 
ప్రేమా హస్తములతో తాకు ప్రభు      ||నీ జల్దరు||

నా హృదయపు వాకిలి తీయుమని
పలు దినములు మంచులో నిలచితివి 
నీ శిరము వానకు తడిచినను 
నను రక్షించుటకు వేచితివి             ||నీ జల్దరు||

ఓ ప్రియుడా నా అతి సుందరుడా
దవళ వర్ణుడా నాకతి ప్రియుడా 
వ్యసనా క్రాంతుడుగా మార్చబడి 
నీ సొగసును నాకు నొసగితివి          ||నీ జల్దరు||

నీ పరిమళ పుష్ప సుగంధములు
నా రోత హృదయమును నింపినవి 
ద్రాక్షా రస ధారల కన్న మరి 
నీ ప్రేమే ఎంతో అతి మధురం          ||నీ జల్దరు||

ఉన్నత శిఖరములు దాటుచును
ఇదిగో అతడొచ్చుచున్నాడు 
నా హృదయపు తలుపులు తెరచుకొని 
నా ప్రియుని కొరకు కనిపెట్టెదను      
||నీ జల్దరు||

నీ విందుశాలకు నడిపించి
రాజులు యాజకులతో జేర్చితివి
జీవాహారము నాకందించి
పరమాగీతములను నేర్పితివి 
         ||నీ జల్దరు||

167. Na Yesuni Jali Preme Nannu Rakshinchenu

నా యేసుని జాలి ప్రేమే నన్ను రక్షించెను
ఆ ఘోర కల్వరిగిరిలో ప్రాణమర్పించగా                  IIనాII

శాశ్వతంబగు ప్రేమతోడ నన్ను ప్రేమించి
విడువక నాయందు తన కృప జూపియుంచెను      IIనాII

గొర్రెవలెనే త్రోవ తప్పి తొలగియుంటిని
వెదకి వెదకి వెంబడించి నన్ను కనుగొనెను              IIనాII

మేలు చేయువాడు లేడు ఒక్కడును లేడు
మేలు చేయను నాదు ప్రభువు మరణమాయెను      IIనాII

పాపిపై నేనింకనుండ ప్రాణ మొసగెనుగా
ప్రేమను నాయందు విభుడే వెల్లడించెను                 IIనాII

ప్రాణమివ్వగ నాదు సోదర ప్రియులకై ప్రియుడు
తనదు ప్రేమ నాకు నేర్పి నిలిపె తన కృపతో          IIనాII

అద్వితీయ కుమారుడాయన యందు నమ్మితిని
నిత్యజీవము నాకు పంచి దాచియుంచెను              IIనాII

ఆనందము నాకానందము హల్లెలూయ స్తుతుల్
పరమ యెరుషలేము నాకై నిలిచియుండగను         IIనాII

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...