సత్యవేద గ్రంధము ఆ.ఆ చదువ చక్కని గ్రంధము
దీన్ని చదువువారే ధన్యులు
1. దేవ వాక్కుల గ్రంధము ఆ.ఆ దీన జనుల గ్రంధము
దీన్ని గైకొనువారే ధన్యులు
2. వాగ్ధానముల గ్రంధము ఆ.ఆ వరదానముల గ్రంధము
దీన్ని నమ్మువారే ధన్యులు
3. జీవాహార గ్రంధము ఆ.ఆ జీవజలముల గ్రంధము
నిత్య జీవమున్నది దీనిలో
4. రెండంచుల ఖడ్గమై ఆ.ఆ ఖండించు జీవవాక్యమై
సజీవవాక్య గ్రంధము
5. సర్వలోక గ్రంధము ఆ. ఆ సాటిలేని గ్రంధము
పరిశుద్ధ గ్రంధమిదియే