Saturday, 20 August 2016

204. Sathyaveda Grandhamu aa aa Chaduva Chakkani


సత్యవేద గ్రంధము ఆ.ఆ చదువ చక్కని గ్రంధము
దీన్ని చదువువారే ధన్యులు

1. దేవ వాక్కుల గ్రంధము ఆ.ఆ దీన జనుల గ్రంధము
దీన్ని గైకొనువారే ధన్యులు

2. వాగ్ధానముల గ్రంధము ఆ.ఆ వరదానముల గ్రంధము
దీన్ని నమ్మువారే ధన్యులు

3. జీవాహార గ్రంధము ఆ.ఆ జీవజలముల గ్రంధము
నిత్య జీవమున్నది దీనిలో

4. రెండంచుల ఖడ్గమై ఆ.ఆ ఖండించు జీవవాక్యమై
సజీవవాక్య గ్రంధము

5. సర్వలోక గ్రంధము ఆ. ఆ సాటిలేని గ్రంధము
పరిశుద్ధ గ్రంధమిదియే

203. Yesayya Ni Noti Mata Kaliginche Nalo Jivapu Oota

యేసయ్యా నీ నోటి మాట
కలిగించె నాలో జీవపు ఊట
నడిపించె నన్ను నీ వెలుగుబాట
నీ కొరకే ఈ నా క్రొత్తపాట
ఈ క్రొత్తపాట

పరము నుండి పరికించినావు
పాపము నుండి విడిపించినావు
నీ రక్షణనే ప్రకించెదన్... ||2||
నా నిరీక్షణ ప్రచురించెదన్ ||2||

నా గానము నీవే నా దేవా
నా గీతము నీకే నా ప్రభువా..
నా దైవము నీవే నీవే యేసయ్యా ||2||
నా జీవము నీకే నా మెస్సయ్యా ||2||

202. Bailu Parachinavu Nee Bibulu

బైలు పరచినావు - నీ - బైబిలు గ్రంథంంబు
బైలుపరచినందున - ప్రభువ వందనంబు

బైలు పరచినావు - ఒక - వ్యక్తికే మొదట
బైలు పరచినావు - ఆ - కాల సభకు పిమ్మట

బైలు పరచినావు - వి - శ్వాస కూటములకు
బైలు పరచినావు - విశ్వాస శాన్య జనులకు

బైలు పరచినావు - ప్రపంచదేశములకు
బైలు పరచినావు - పదివందల బాషలకు

బైలు పరచినావు - నీ - వాసులమౌ మాకు
బైలు పరచినావు - రెండు - వేల కాల జనులకు

అచ్చు పుట్టినప్పుడే - అది - అచ్చు వేయించినావు
నచ్చినట్టి వారిలో - అది - గ్రుచ్చి వేసినావు

బైలు పరుపగలవు - రా - వలసిన జనములకు
బైలు పరుపగలవు - యుగ - కాలముల వరకు

జనక సుతాత్మకలకు - మా - వినయ వందనములు
అనయు సత్కీర్తియు - ఘనతయు స్తోత్రములు

201. Nee Vakyame Nannu Brathikinchenu

నీ వాక్యమే నన్ను బ్రతికించెను
బాధలలో నెమ్మది నిచ్చెను
కృపాశక్తి దయాసత్య సంపూర్ణు 
వాక్యమై యున్న యేసు వందనమయ్యా

జిగటగల యూబి నుండి లేవనెత్తెను
సమతలమగు భూమిపై నన్నునిలిపెను
నా పాదములకు దీపమాయెను
సత్యమైన మార్గములో నడుపుచుండెను

శతృవులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై
యుద్ధమునకు సిద్ధ మనస్సు నిచ్చుచున్నది
అపవాది వేయుచుండు అగ్ని బాణములను
ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది

పాలవంటిది జుంటె తెనె వంటిది
నా జిహ్వకు మహా మధురమైనది
మేలిమి బంగారుకన్న మిన్నయైునది
రత్నరాశుల కన్నా కోరదగినది.

Wednesday, 10 August 2016

200. Natho Matladu Prabhuva Nive Matladumayya

నాతో మాట్లాడు ప్రభువా – నీవే మాట్లాడుమయ్యా (2)
నీవు పలికితే నాకు మేలయ్యా (2)
నీ దర్శనమే నాకు చాలయ్యా (2)              ||నాతో||

నీ వాక్యమే నన్ను బ్రతికించేది
నా బాధలలో నెమ్మదినిచ్చేది (2)               ||నీవు||

నీ వాక్యమే స్వస్థత కలిగించేది
నా వేదనలో ఆదరణిచ్చేది (2)                   ||నీవు ||

నీ వాక్యమే నన్ను నడిపించేది
నా మార్గములో వెలుతురునిచ్చేది (2)    ||నీవు ||

199. Mahonnathuda Ni Krupalo Nenu Nivasinchuta

మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట
నా జీవిత ధన్యతై యున్నది

మోడుబారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు
మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు

ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలియించనా
జీవజలముల ఊటయైన నీ ఓరను నను నాటితివా

వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి యుంచితివా
వాగ్ధాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా

198. Niti Yuta Yodda Natabadithimi

నీటి యూట యొద్ద నాటబడితిమి
వేరు తన్ని ఎదిగి ఫలియింతుము
చింతపడము మా కాపు మానము
యేసు కృప చాలును||2||
యేసు కృప చాలును                 II నీటిII

పాపం పోయెను - హల్లెలూయా
యేసు లేచెను - హల్లెలూయా
యేసు వచ్చును హల్లెలూయా
స్తుతిగీతం పాడుదమ ||2||
స్తుతిగీతం పాడుదమ                    II నీటిII

యేసే మార్గము – హల్లెలూయా
యేసే సత్యము - హల్లెలూయా
యేసే జీవము - హల్లెలూయా
యేసు వార్తను చాటుదమ ||2||
యేసు వార్తను చాటుదమ             II నీటిII

వాక్య ధ్యానంతో - హల్లెలూయా
ప్రార్ధనాత్మతో - హల్లెలూయా
ఏకత్వముతో - హల్లెలూయా
సహవాసము కోరుదమ ||2||
సహవాసము కోరుదమ             II నీటిII

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...