Tuesday, 23 August 2016

222. Chintaledika Yesu Puttenu

చింత లేదిక యేసు పుట్టెను
వింతగను బెత్లేహమందున
చెంత జేరను రండి సర్వ జనాంగమా
సంతసమొందుమా (2)

దూత తెల్పెను గొల్లలకు
శుభవార్త నా దివసంబు వింతగా
ఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరి
స్తుతులొనరించిరి           ||చింత లేదిక||

చుక్క గనుగొని జ్ఞానులేంతో
మక్కువతో నా ప్రభుని కనుగొన
చక్కగా బేత్లేము పురమున జొచ్చిరి
కానుకలిచ్చిరి          ||చింత లేదిక||

కన్య గర్భమునందు పుట్టెను
కరుణగల రక్షకుడు క్రీస్తుడు
ధన్యులగుటకు రండి వేగమే దీనులై
సర్వ మాన్యులై          ||చింత లేదిక||

పాపమెల్లను పరిహరింపను
పరమ రక్షకుడవతరించెను
దాపు జేరిన వారికిడు కడు భాగ్యము
మోక్ష భాగ్యము       ||చింత లేదిక||

221. Karuna Vahinilo Nannu Sudhi Cheya Vachina

కరుణవాహినిలో నన్ను శుద్ధి చేయ వచ్చిన

కన్యసుతుడ యేసు నీకు మంగళం

కాంతిపుంజములతో నన్ను తాకి శుభ్రపరచిన

కాంతిమయుడ క్రీస్తు నీకు వందనం

కారుణ్యమూర్తివి దేదీప్య రూపివి

నరుల కొరకు నీవు నరుడవైతివి

ఎందుకింత ప్రేమయో ఎందుకింత జాలియో

ఎవరు చెప్పగలరు ఏమి వింతయో

పాప కూపమందు నేను చితికి పతనమొందగ

పేరు పిలిచి నన్ను బ్రోచినాడవే

పాపి మోయతగిన శాప భారమంత మోయనై

పాపలోకమునకు వచ్చినాడవే

పవిత్ర మూర్తివి ప్రశాంత రూపివి

పాపమేమి లేని పుణ్యశాలివి

పల్లవించు నాదు హృదయమెపుడు నీకు స్తోత్రము

పరవశించు నీదు నామ స్మరణతో

పావనుండ నీదు పాదపద్మ సేవ చేతును

పాహిమాం పాహిమాం పాహిమాం

ప్రశాంత వదనుడ ప్రదీప్తిమంతుడ

ప్రేమధారుడ పాపి మిత్రుడ

220. O Sadbhakthulara Loka Rakshakundu

ఓ సద్భాక్తులారా – లోక రక్షకుండు
బెత్లేహేమందు నేడు జన్మించెన్
రాజాధి రాజు – ప్రభువైన యేసు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి ఉత్సాహముతో

సర్వేశ్వరుండు – నర రూపమెత్తి
కన్యకు బుట్టి నేడు వేంచేసెన్
మానవ జన్మ – మెత్తిన శ్రీ యేసూ
నీకు నమస్కరించి నీకు నమస్కరించి
నీకు నమస్కరించి పూజింతుము

ఓ దూతలారా – ఉత్సాహించి పాడి
రక్షకుండైన యేసున్ స్తుతించుడి
పరాత్పరుండా – నీకు స్తోత్రమంచు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి ఉత్సాహముతో

యేసూ! ధ్యానించి – నీ పవిత్ర జన్మ
మీవేళ స్తోత్రము నర్పింతుము
అనాది వాక్య – మాయే నర రూపు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి ఉత్సాహముతో


219. Aha Mahanandame Iha Parambulan

ఆహా మహానందమే ఇహపరంబులన్‌

మానవతారుండౌ మా యేసు జన్మదినం

హల్లెలూయ ఆహా మహానందమే

కన్యక గర్భమందు పుట్టగ 

ధన్యుడవనుచు దూతలెందరో

మాన్యులు పేద గొల్లలెందరో 

ఆ దూర తూర్పు జ్ఞానులెందరో

నిన్‌ ఆరాధించిరి - హల్లెలూయ

యెహోవా తనయా యేసుప్రభో 

సహాయుడౌ మా స్నేహితుడ

ఇహపరంబుల్‌ ఓ ఇమ్మానుయేల్‌ 

మహానందంబుతో నిన్నారాధింతుము

నిన్నారాధింతుము - హల్లెలూయ

సర్వేశ్వరున్‌ రెండవ రాకన్‌ 

స్వర్గంబు నుండి వచ్చు వేళలో

సార్వత్రిక సంఘంబు భక్తితో 

సంధించి నిన్ను సోత్రించువేళలో

నిన్నారాధింతుము - హల్లెలూయ

పరిశుద్ధ స్థలమందునుండియు 

పాపుల రక్షించు గొప్ప ప్రేమతో

మహోపకారంబు సేయనెంచిన 

మా సృష్టికర్త నీ బిడ్డలెందరో

నిన్నారాధింతుము - హల్లెలూయ

218. Ambaraniki Antela Sambaralatho

అంబరానికి అంటేలా
సంబరాలతో చాటాలా (2)
యేసయ్య పుట్టాడని
రక్షింప వచ్చాడని (2)

ప్రవచనాలు నెరవేరాయి
శ్రమ దినాలు ఇక పోయాయి (2)
విడుదల ప్రకటించే
శిక్షను తప్పించే (2)           ||యేసయ్య||

దివిజానాలు సమకూరాయి
ఘనస్వరాలు వినిపించాయి (2)
పరముకు నడిపించే
మార్గము చూపించే (2)           ||యేసయ్య||

సుమ వనాలు పులకించాయి
పరిమళాలు వెదజల్లాయి (2)
ఇలలో నశియించే
జనులను ప్రేమించే (2)           ||యేసయ్య||

217. Andala Thara Arudenche Nakai

అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలో
ఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని               ||అందాల తార||

విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెను
వింతైన శాంతి వర్షించె నాలో విజయపథమున
విశ్వాలనేలెడి దేవకుమారుని వీక్షించు దీక్షలో
విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్         ||అందాల తార||

యెరూషలేము రాజనగరిలో యేసును వెదకుచు
ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి
యేసయ్యతార ఎప్పటివోలె ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు      ||అందాల తార||

ప్రభుజన్మస్ధలము పాకయేగాని పరలోక సౌధమే
బాలునిజూడ జీవితమెంత పావనమాయెను
ప్రభుపాదపూజ దీవెనకాగా ప్రసరించె పుణ్యము
బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన           ||అందాల తార||


216. Vastunnanu Prabhuva Vastunnanu

వస్తున్నాను ప్రభువా వస్తున్నాను
నీ యందమైన మందిరానికి వస్తున్నాను

వచ్చిన పాపిని వద్దనవద్దు కన్నతండ్రి
నీ యొద్ద చేర్చి బుద్ధి చెప్పుము పరమతండ్రి

నింగినేల నీవెనయ్యా యేసునాధా
నిఖిల జగములు నీవేనయ్యా దేవదేవ

పాపులనెల్ల ప్రేమించావు యేసునాధా
మా పాపాలన్ని క్షమియించావు దేవదేవ

అట్టిబోధ నాకందించు యేసునాధా 
నీ యాత్మతో నింపుము నన్ను దేవదేవా

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...