కరుణవాహినిలో నన్ను శుద్ధి చేయ వచ్చిన
కన్యసుతుడ యేసు నీకు మంగళం
కాంతిపుంజములతో నన్ను తాకి శుభ్రపరచిన
కాంతిమయుడ క్రీస్తు నీకు వందనం
కారుణ్యమూర్తివి దేదీప్య రూపివి
నరుల కొరకు నీవు నరుడవైతివి
ఎందుకింత ప్రేమయో ఎందుకింత జాలియో
ఎవరు చెప్పగలరు ఏమి వింతయో
పాప కూపమందు నేను చితికి పతనమొందగ
పేరు పిలిచి నన్ను బ్రోచినాడవే
పాపి మోయతగిన శాప భారమంత మోయనై
పాపలోకమునకు వచ్చినాడవే
పవిత్ర మూర్తివి ప్రశాంత రూపివి
పాపమేమి లేని పుణ్యశాలివి
పల్లవించు నాదు హృదయమెపుడు నీకు స్తోత్రము
పరవశించు నీదు నామ స్మరణతో
పావనుండ నీదు పాదపద్మ సేవ చేతును
పాహిమాం పాహిమాం పాహిమాం
ప్రశాంత వదనుడ ప్రదీప్తిమంతుడ
ప్రేమధారుడ పాపి మిత్రుడ
This comment has been removed by the author.
ReplyDeleteI want audio song
ReplyDelete9989408996 please what’s ap
Deletehttps://youtube.com/watch?v=85S8FaEPV5s&si=EnSIkaIECMiOmarE
ReplyDeleteThis lyric was written by Rev Dr D V Daniel garu (Ordained Pastor, AELC), former Director of Suvartha Vani, Vijayawada.
ReplyDelete