యేసుక్రీస్తు వారి కథ వినుడి - దేశీయులారా
యేసుక్రీస్తు వారి కథ వినుడి = దోసకారులన్ రక్షింప
దోసములంటని రీతిగనె దాసుని రూపంబుతో
మన - ధరణిలో వెలసిన దేవుండౌ
పాపులను నిందించి యే విధ - శాప వాక్కుల్ పల్కలేదు
పాపులకు గతి లేదని చెప్పి - పారద్రోలి వేయలేదు
కోపపడుచు పాపులను రా - కూడదని వచియింపలేదు
పాపములు పరిహారము చేసి పరమ దేవుడు తానని తెల్పిన
నరులకు దేవుడు తండ్రియును - వరుస బైలు పరచినాడు
పొరుగు వారు సోదరులన్న - మరొక వరుస తేల్చినాడు
మరియు దేవున్ పొరుగు వారిన్ సరిగ ప్రేమించమన్నాడు
కొరత లేకుండ సర్వాజ్ఞల్ - నెరవేర్చి మాదిరి జూపిన
వాక్కు వినవచ్చిన వారలకు - వాక్యాహారమున్ తినిపించె
ఆకలితో నున్న ఆ యైదు వేలన్ గనికరించె - మూకకు
వండని రొట్టెలను - బుట్టించితృప్తిగా వడ్డించె = లోకమంతకు
పోషకుడు తా - నే కదా యని మెప్పు గాంచిన
దురితములను తత్ఫలములను - దుష్టుడౌ సైతానును గెల్చె
తరుణ మందు మృతులన్ లేపె - దయ్యములను దరిమివైచె
నరుల భారమున్ వహియించి - మరణమొంది తిరిగి లేచె
తిరుగ వచ్చెదనంచు మోక్ష - పురము వెళ్ళి గూర్చున్న
మరల యూదుల్ దేశమునకు-మళ్ళుచున్నా రిదియొక గుర్తు
పరుగు లెత్తుచున్నవి కారుల్ - బస్సులు ఇది మరియొక గుర్తు
కరువులు మత వాదాలు భూ - కంపముల్ యుద్ధాలొక గుర్తు
గురుతులై పోయినవి గనుక - త్వరగ వచ్చుచున్న శ్రీ
యేసునాధుని చెంత చేరుము
నీ దురంత వింత పాపమంత పోవును
యేసునాధుని చేరి వేడుము
నీదు హృదయమంత యేసు శాంతి నిండును
యేసే మార్గం సత్యం జీవం
రావా సోదరా సోదరీ జాలమేలరా
సిలువమ్రానుపై యేసు వ్రేలాడెన్
సకల లోక పాపమంత పరిహరించెను
సిలువ నీడలో యేసు తోడుగా
అవధి లేని ఆ ప్రేమ నిన్ను పిలువగా ||రావా||
యేసుప్రేమలో సేద దీరుము
అలసినట్టి నీ మది విశ్రాంతి నొందును
యేసు ప్రేమలో నిలిచియుండుము
ఆ ప్రేమ నీలో ప్రభావింపగా ||రావా||
యేసు వెలుగును వెంబడించుము
యేసుబాటలో చీకటసలే యుండదు
యేసు వెలుగులో నడిచి వెళ్లుము
ఆ వెలుగు నీలో ప్రకాశింపగా ||రావా||
భారతదేశమా నా యేసుకే (4)
నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన
నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం
యేసు నామమే జయము జయమనిహమంత మారు మ్రోగాలి
పని చేయుచున్న సాతాను శక్తులు పాపంచలైపోవాలి (2)
భారత దేశమా - నా భారత దేశమా
నా ప్రియ య ఏసునకే - నీవు సొంతం కావాలి
భారత దేశమా - నా భారతదేశమా
ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి
సృష్టికర్తనే మరచి – భారత దేశమా
సృష్టిని పూజించుట తగునా – నా భారత దేశమా
ఈ లోకమును సృష్టించిన యేసే – భారత దేశమా
నిను రక్షించుటకు ప్రాణం పెట్టెను – భారత దేశమా
భారత దేశమా యేసుని చేరుమా
నూతన సృష్టిగ మార్చబడుదువు భారత దేశమా
శాంతికి అధిపతి ఆ యేసే - భారతదేశమా
శాంతి రాజ్యమును స్థాపించును నా భారతదేశమా
లోకమంతయు లయమైపోవును - భారతదేశమా
లోకాశలన్నియు గతించి పోవును - భారతదేశమా
భారతదేశమా - యేసుని చేరుమా
శాంతి సమాధానములను పొందుము భారతదేశమా
రాజుల రాజుగ మన యేసే - భారతదేశమా
పెండ్లి కుమారుడై రానుండె - భారతదేశమా
యేసుని నమ్మిన దేశములన్ని - భారతదేశమా
యేసుతో కూడా కొనిపోబడెను - భారతదేశమా
భారతదేశమా - యేసుని చేరుమా
సువర్ణ దేశముగ మార్చబడుదువు భారతదేశమా