యేసుక్రీస్తు వారి కథ వినుడి - దేశీయులారా
యేసుక్రీస్తు వారి కథ వినుడి = దోసకారులన్ రక్షింప
దోసములంటని రీతిగనె దాసుని రూపంబుతో
మన - ధరణిలో వెలసిన దేవుండౌ
రోగులన్ కొందరిని జూచి - బాగుచేయనని యనలేదు
రోగముల తీరది పరికించి - బాగుచేయ లేననలేదు
రోగముల నివారణకై - యోగముల్ తాజెప్పలేదు
యోగ యోగుల మించు వైద్య యోగి తానని ఋజువు గొన్న
పాపులను నిందించి యే విధ - శాప వాక్కుల్ పల్కలేదు
పాపులకు గతి లేదని చెప్పి - పారద్రోలి వేయలేదు
కోపపడుచు పాపులను రా - కూడదని వచియింపలేదు
పాపములు పరిహారము చేసి పరమ దేవుడు తానని తెల్పిన
నరులకు దేవుడు తండ్రియును - వరుస బైలు పరచినాడు
పొరుగు వారు సోదరులన్న - మరొక వరుస తేల్చినాడు
మరియు దేవున్ పొరుగు వారిన్ సరిగ ప్రేమించమన్నాడు
కొరత లేకుండ సర్వాజ్ఞల్ - నెరవేర్చి మాదిరి జూపిన
వాక్కు వినవచ్చిన వారలకు - వాక్యాహారమున్ తినిపించె
ఆకలితో నున్న ఆ యైదు వేలన్ గనికరించె - మూకకు
వండని రొట్టెలను - బుట్టించితృప్తిగా వడ్డించె = లోకమంతకు
పోషకుడు తా - నే కదా యని మెప్పు గాంచిన
దురితములను తత్ఫలములను - దుష్టుడౌ సైతానును గెల్చె
తరుణ మందు మృతులన్ లేపె - దయ్యములను దరిమివైచె
నరుల భారమున్ వహియించి - మరణమొంది తిరిగి లేచె
తిరుగ వచ్చెదనంచు మోక్ష - పురము వెళ్ళి గూర్చున్న
పాపులకు రోగులకు బీద - వారికి దేవుండు యేసే
ఆపదలన్నిలో నిత్య - మడ్డు పడు మిత్రుండు క్రీస్తే
పాపమున పడకుండగా - పాడెడు శిల యేసుక్రీస్తే
పాపులాశ్రయించిన యెడల - పరలోకమునకు గొంపోవు
మరల యూదుల్ దేశమునకు-మళ్ళుచున్నా రిదియొక గుర్తు
పరుగు లెత్తుచున్నవి కారుల్ - బస్సులు ఇది మరియొక గుర్తు
కరువులు మత వాదాలు భూ - కంపముల్ యుద్ధాలొక గుర్తు
గురుతులై పోయినవి గనుక - త్వరగ వచ్చుచున్న శ్రీ
No comments:
Post a Comment