Tuesday, 23 January 2018

333. Priya Yesu Nirminchithivi Priyamara Na Hrudayam

ప్రియ యేసు నిర్మించితివి
ప్రియమార నా హృదయం
మృదమార వసియించునా
హృదయాంతరంగమున

నీ రక్త ప్రభావమున
నా రోత హృదయంబును (2)
పవిత్రపరచుము తండ్రి
ప్రతి పాపమును కడిగి (2)          ||ప్రియ యేసు||

అజాగరూకుడనైతి
నిజాశ్రయమును విడచి (2)
కరుణారసముతో నాకై
కనిపెట్టితివి తండ్రి (2)          ||ప్రియ యేసు||

వికసించె విశ్వాసంబు
వాక్యంబును చదువగనే (2)
చేరితి నీదు దారి
కోరి నడిపించుము (2)          ||ప్రియ యేసు||

ప్రతి చోట నీ సాక్షిగా
ప్రభువా నేనుండునట్లు (2)
ఆత్మాభిషేకమునిమ్ము
ఆత్మీయ రూపుండా (2)          ||ప్రియ యేసు||

332. Prabhu Yesuni Vadanamulo Na Devudu Kanipinche

ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించె
పాపాత్ముల బ్రోచుటకై కృపలొలికిన కలువరిలో
పరలోకముకై చిరజీవముకై ప్రార్ధించెను నా హృదయం

దిశలన్నియు దిరిగితిని - నా పాపపు దాహముతో
దౌష్ట్యముతో మసలుచును - దౌర్జన్యము చేయుచును
ధనపీడనతో మృగవాంఛలతో - దిగజారితి చావునకు

చెండాడితి బ్రతుకులను - దహియించితి గృహములను
చెరగవు నా పాపములు - తరగవు నా వేదనలు
చనిపోయినను ధరవీడినను - చల్లారవు శోకములు

పలుమారులు వినుచుంటి - నజరేయుని నీతికధ
పరిహాసము చేసితిని - పరమార్ధమె మోసమని
పశుప్రాయుడనై జీవించుటచే - ప్రాప్తించెను యీ సిలువ

కలువరి యావరణములో - కరుణాత్ముని చేరువను
కనుమూసిన కాలములో - వెలుగుదయించిన వేళ
కనుగొంటిని నా దౌర్భాగ్యస్థితి - కంపించెను నా తనువు

యేసు నీ రాజ్యముతో - భువికేతెంచెడి రోజు
ఈ పాపిని క్షమియించి - జ్ఞాపకముతో బ్రోవుమని
యిల వేడితిని విలపించితిని యీడేరెను నా వినతి

పరదైసున ఈ దినమే - నా యానందములోను
పాల్గొందువు నీవనుచు - వాగ్ధానము చేయగనే
పరలోకమే నా తుది ఊపిరిగా - పయనించితి ప్రభు కడకు

Monday, 22 January 2018

331. Prabhu Yesu Na Rakshaka Nosagu Kannulu Naku

ప్రభు యేసు నా రక్షకా
నొసగు కన్నులు నాకు
నిరతము నే నిన్ను జూడ (2)
అల్ఫయు నీవే – ఒమేగయు నీవే (2) ||ప్రభు యేసు||

ప్రియుడైన యోహాను పత్మాసులో
ప్రియమైన యేసు నీ స్వరూపము (2)
ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె
ప్రియ ప్రభు
 నిన్ను జూడనిమ్ము (2)        ||ప్రభు యేసు||

లెక్కలేని మార్లు పడిపోతిని
దిక్కులేనివాడ నేనైతిని (2)
చక్కజేసి నా నేత్రాలు దెరచి
గ్రక్కున నిన్ను జూడనిమ్ము (2)                ||ప్రభు యేసు||

ఎరిగి యెరిగి నే చెడిపోతిని
యేసు నీ గాయము రేపితిని (2)
మోసపోతి నేను దృష్టి దొలగితి
దాసుడ నిను జూడనిమ్ము (2)                ||ప్రభు యేసు||

ఎందరేసుని వైపు చూచెదరో
పొందెదరు వెలుగు ముఖమున (2)
సందియంబు లేక సంతోషించుచు
ముందుకు పరుగెత్తెదరు (2)                  ||ప్రభు యేసు||

విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూ
కొనసాగించువాడా యేసు ప్రభూ (2)
వినయముతో నేను నీ వైపు జూచుచు
విసుగక పరుగెత్త నేర్పు (2)            ||ప్రభు యేసు||

కంటికి కనబడని వెన్నియో
చెవికి వినబడని వెన్నియో (2)
హృదయ గోచరము కాని వెన్నియో
సిద్ధపరచితివ నాకై (2)                        ||ప్రభు యేసు||

లోక భోగాలపై నా నేత్రాలు
సోకకుండునట్లు కృప జూపుము (2)
నీ మహిమ దివ్య స్వరూపమును
నిండార నను జూడనిమ్ము (2)           ||ప్రభు యేసు||

330. Prabhu Prema Tholikeka Hrudayamulo Prathidwaniyinche

ప్రభుప్రేమ తొలికేక
హృదయములో ప్రతిధ్వనియించే
పాప క్షమా యేసునిలో
శరణు నొసంగుచు కనిపించే

పాప వికారము పొడసూప
జీవిత విలువలు మరుగాయె
పతితనుగా లోకములో
బ్రతుకుటయే నా గతియాయె
పలువురిలో కనబడలేకా
దాహముతో నేనొంటరిగా
బావికని పయనింపా
నాధుని దర్శనమెదురాయే
పావనుడు దాహముతో
జలమును ఇమ్మని ననుగోరె

జాతిని చూడని నేత్రముతో
పాపము శోకని హృదయముతో
జాలిని జాటించుచునే
తాకెను నా మది వేదనతో
జాప్యము చేయక తెమ్మనియే
దాచుకొనిన నా పాపమును
జడియుచునే తెలిపితిని
ప్రభువెరిగిన నా నిజస్థితిని
జయమొందె నా తనువు
సరిగ నుడితివని ప్రభు తెలుపా

దేహమునే నా సర్వముగా
భావించుచు మది పూజింపా
దినదినమూ నా జీవితము
చావుగ మారిన కాలములో
దేవునిగా నా బంధువుగా
మరణ ప్రవాహము చేధించి
దరిజేర్చి దీవించి
నూతన జన్మ ప్రసాదించె
దయ్యాల కుహరమును
స్తుతి మందిరముగ రూపించే

పాపము దాగొను నా బావి
లోతును ఎరిగిన వారెవరు
పోరాటవాటికయే
నా బ్రతుకును చూచినదెవరు
పాపికిని పాపమునకును
భేదము చూపిన వారెవరు
పాపిని కాపాడుటకు
సిలువను మోసినదెవరు
ప్రకటించే దైవకృప
తెరచెను జీవన జలనిధులు

ఘటముతో వెడలితి నొంటరిగా
పితరులు త్రావిన జలములకై
కనబడెను బావికడ
రక్షణ యూటల ప్రభుయేసు
కుండను వీడ పరుగిడితి
బావిని చేకొని హృదయములో
ఘనమైన శుభవార్త
ఆతృతతో ప్రజలకు తెలుపా
గ్రామ ప్రజా కనుగొనిరి
విశ్వవిమోచకుడగు యేసున్

329. Papini Yesu Prabho Nenu Papini Yesu Prabho

పాపిని యేసుప్రభో నేను పాపిని యేసుప్రభో
నీ రక్తపు ధారలచే - నను గావుము యేసుప్రభో
నిను నే మరువనేసు - నిను నే విడువనేసు

నీవు పవిత్రుడవు నే నపవిత్రుడను
నీ రక్త ప్రభావముచే - పవిత్రుని జేయు ప్రభూ

చిందిన రక్తముచే నే బొందితి స్వస్థతను
సంధించుము యాత్మతో - నన్ను నిష్కళంకుని జేయు ప్రభూ

మంటిని నేను ప్రభూ - కనుగొంటిని నీ కృపలన్
రానుంటిని నీ దరికిన్ - మన్నించుము యేసుప్రభూ

328. Papini Deva Darshanameeva

పాపిని దేవా దర్శనమీవా
ప్రేమ స్వరూపుడా – యేసుప్రభువా

అహమును పెంచి - అపజయములతో
ఆవేదనలతో - అలసితి ప్రభువా
ఆత్మ స్వరూపుడా - కరుణించు నన్ను

కలుషితమైన - నా జీవితములో
కలువరమొందితి - దురితంబులతో
కరుణా సారధి - కరుణించు దేవా

327. Papala Bharambu Mosi Parithapamondedi Prajala

పాపాల భారంబు మోసి - పరితాపమొందెడి ప్రజల
ప్రభుయేసు రమ్మని పిలిచే - పరిపూర్ణ విశ్రాంతినీయ

లోకాశలకు నీవు లొంగి - లోలోన కుములుచు కృంగి
ఎదలోన ఎండి నశించి - ఏ మేలు లేక కృశించి
ప్రభుయేసు పిలచుచుండ - పరితృప్తి నొందలేవా

జీవింప నీవు వేసారి - పయనించు ఓ బాటసారి
ఇంకెంతకాల - మీ బ్రతకు యికనైన తీరని బరువు
నీ భారమంతయు బాపి - పరిపూర్ణ విశ్రాంతి నీయ

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...