Tuesday, 23 January 2018

332. Prabhu Yesuni Vadanamulo Na Devudu Kanipinche

ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించె
పాపాత్ముల బ్రోచుటకై కృపలొలికిన కలువరిలో
పరలోకముకై చిరజీవముకై ప్రార్ధించెను నా హృదయం

దిశలన్నియు దిరిగితిని - నా పాపపు దాహముతో
దౌష్ట్యముతో మసలుచును - దౌర్జన్యము చేయుచును
ధనపీడనతో మృగవాంఛలతో - దిగజారితి చావునకు

చెండాడితి బ్రతుకులను - దహియించితి గృహములను
చెరగవు నా పాపములు - తరగవు నా వేదనలు
చనిపోయినను ధరవీడినను - చల్లారవు శోకములు

పలుమారులు వినుచుంటి - నజరేయుని నీతికధ
పరిహాసము చేసితిని - పరమార్ధమె మోసమని
పశుప్రాయుడనై జీవించుటచే - ప్రాప్తించెను యీ సిలువ

కలువరి యావరణములో - కరుణాత్ముని చేరువను
కనుమూసిన కాలములో - వెలుగుదయించిన వేళ
కనుగొంటిని నా దౌర్భాగ్యస్థితి - కంపించెను నా తనువు

యేసు నీ రాజ్యముతో - భువికేతెంచెడి రోజు
ఈ పాపిని క్షమియించి - జ్ఞాపకముతో బ్రోవుమని
యిల వేడితిని విలపించితిని యీడేరెను నా వినతి

పరదైసున ఈ దినమే - నా యానందములోను
పాల్గొందువు నీవనుచు - వాగ్ధానము చేయగనే
పరలోకమే నా తుది ఊపిరిగా - పయనించితి ప్రభు కడకు

No comments:

Post a Comment

Sarvadhikariyaina Sarva Sakthimanthudu | Telugu Christian Song # 604

ఏదైనా సాధ్యమే | Telugu Christian Song ✨ ఏదైనా సాధ్యమే ✨ సర్వాధికారియైన సర్వశక్తిమంతుడు అధిక ప్రేమామయ...

About Me

My photo
I’m Gnana Ratnam Veladuti, a devoted Christian sharing devotional messages and sermons. My goal is to encourage believers to stay strong in faith.

📌 Follow my blog for daily inspiration and spiritual encouragement.