ప్రభుప్రేమ తొలికేక
హృదయములో ప్రతిధ్వనియించే
పాప క్షమా యేసునిలో
శరణు నొసంగుచు కనిపించే
పాప వికారము పొడసూప
జీవిత విలువలు మరుగాయె
పతితనుగా లోకములో
బ్రతుకుటయే నా గతియాయె
పలువురిలో కనబడలేకా
దాహముతో నేనొంటరిగా
బావికని పయనింపా
నాధుని దర్శనమెదురాయే
పావనుడు దాహముతో
జలమును ఇమ్మని ననుగోరె
జాతిని చూడని నేత్రముతో
పాపము శోకని హృదయముతో
జాలిని జాటించుచునే
తాకెను నా మది వేదనతో
జాప్యము చేయక తెమ్మనియే
దాచుకొనిన నా పాపమును
జడియుచునే తెలిపితిని
ప్రభువెరిగిన నా నిజస్థితిని
జయమొందె నా తనువు
సరిగ నుడితివని ప్రభు తెలుపా
దేహమునే నా సర్వముగా
భావించుచు మది పూజింపా
దినదినమూ నా జీవితము
చావుగ మారిన కాలములో
దేవునిగా నా బంధువుగా
మరణ ప్రవాహము చేధించి
దరిజేర్చి దీవించి
నూతన జన్మ ప్రసాదించె
దయ్యాల కుహరమును
స్తుతి మందిరముగ రూపించే
పాపము దాగొను నా బావి
లోతును ఎరిగిన వారెవరు
పోరాటవాటికయే
నా బ్రతుకును చూచినదెవరు
పాపికిని పాపమునకును
భేదము చూపిన వారెవరు
పాపిని కాపాడుటకు
సిలువను మోసినదెవరు
ప్రకటించే దైవకృప
తెరచెను జీవన జలనిధులు
ఘటముతో వెడలితి నొంటరిగా
పితరులు త్రావిన జలములకై
కనబడెను బావికడ
రక్షణ యూటల ప్రభుయేసు
కుండను వీడ పరుగిడితి
బావిని చేకొని హృదయములో
ఘనమైన శుభవార్త
ఆతృతతో ప్రజలకు తెలుపా
గ్రామ ప్రజా కనుగొనిరి
విశ్వవిమోచకుడగు యేసున్