Tuesday, 23 January 2018

352. Yehova Ni Namamu Entho Balamainadi

యెహోవా నీ నామము - ఎంతో బలమైనది

మోషే ప్రార్ధింపగా - మన్నాను కురుపించితివి
యెహోషువ ప్రార్ధింపగా - సూర్య చంద్రుల నాపితివి

నీ ప్రజల పక్షంబుగా - యుద్ధంబులు చేసిన దేవా
అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి

సింహాల బోనయిననూ - సంతోషముగ వెళ్ళిరి
ప్రార్ధించిన వెంటనే - రక్షించే నీ హస్తము

చెరసాలలో వేసినా - సంకెళ్ళు బిగియించినా
సంఘము ప్రార్ధింపగా - బంధాలు విడిపోయెను

పౌలు సీలను బంధించి - చెరసాలలో వేసినా
పాటలతో ప్రార్ధింపగా - చెరసాల బ్రద్దలాయె

మానవుల రక్షణకై - నీ ప్రియ కుమారుని  
లోకమునకు పంపగా - ప్రకటించె నీ వాక్యము

351. Yehova Na Moranalinchenu Thana Mahadayanu Nanu Ganinchenu

యెహోవా నా మొరనాలించెను
తన మహాదయను నను గణించెను
అహర్నిశల దీనహీనుడగు
నాదు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను

పిశాచకడిమి బడగొట్టెను
దన వశాన నను నిలువబెట్టెను
ప్రశాంతమధుర సువిశేష
వాక్ఫల నిశాంతమున జేర్చి సేద దీర్చెను

మదావళము బోలు నామదిన్
దన ప్రదీప్త వాక్యం కునాహతిన్
యధేచ్ఛలన్ని గుదించి
పాపపు మొదల్ తుదల్ నరికి దరికి జేర్చెను

అనీతివస్త్ర మెడలించెను
యేసునాధు రక్తమున ముంచెను
వినూత్న యత్నమె తనూని యెన్నడు
గనన్ వినన్ ప్రేమ నాకు జూపెను

విలాపములకు చెవి నిచ్చెను
శ్రమ కలాపములకు సెలవిచ్చెను
శిలానగము పైకిలాగి నను సుఖ
కళావళుల్ మనసులోన నిలిపెను

అగణ్య పాపియని త్రోయక
నను గూర్చి తన సుతుని దాచక
తెగించి మృతికొప్పగించి
పాపపు నెగుల్ తెగుల్ సొగసుగా వణంచెను

350. Bahuga Prardhana Cheyudi Ikamidata Bahuga Prardhana Cheyudi

బహుగా ప్రార్ధన చేయుడి
ఇకమీదట బహుగా ప్రార్ధన చేయుడి
బహుగా ప్రార్ధన చేసి - బలమున్ సంపాదించి
మహిలో కీడును గెల్వుడి
దేవుని కెపుడు మహిమ కలుగనీయుడి

చెడుగెక్కువగుచున్నది
భూలోకమున చెడుగెక్కువగుచున్నది
చెడుగుపై - మంచిపై చేయగలదౌనట్లు
విడువక ప్రార్ధించుడి
మీ ప్రార్ధన కడవరకు బోనీయుడి

వాగ్ధానములు చూడుడి
దేవుని గ్రంధ వాగ్ధానములు చూడుడి
వాగ్ధానములె జరుగవలసిన కార్యంబుల్
వాగ్ధానములు నమ్ముడి
ఈరీతిగా ప్రభవును సన్మానించుడి

విందునన్న దేవుని వాగ్ధానము
విందుగా ధ్యానించుడి
విందులో నుండగా వింతగా నెరవేర్పు
బొంది యానందింతురు
ఇది రెండవ విందంచు గ్రహియింతురు

విసుగుదల జెందరాదు
ప్రార్ధన నెరవేర్పు తక్షణమే రాదు
విసుగున్నచో సిద్ధి వెనుకకే పోవును
వసియించుడి దేవుని
వాగ్ధానమున భటులవలె నిల్వుడి

సంశయము పనికిరాదు
లేశంబైన సంశయము పనికిరాదు
సంశయింపక దైవసన్నిధియందు మీ
యంశము విడజెప్పుడి
దానికి గొప్ప యంశ బట్టనీయుడి

సిద్ధికనుపింపకున్న
వాగ్ధానములో - సిద్ధియున్నది చూడుడి
సిద్ధి యప్పుడు మీకై - సిద్ధమై వెడలి
ప్రసిద్ధి లోనికి వచ్చును
మీ నమ్మిక వృద్ధి గాంచి నిల్చును

సంతోషమొందరారె
మనదేవుని సంస్తుతి చేయరారె
సంతోష బలముచే - సర్వ కష్టములను
అంతరింపజేతుము
మనదేవుని సంతోషపరచెదము

అంతయు మనదేగదా
యేసునికున్న - దంతయు మనదేగదా
అంతయు మన ప్రభువు-ఆర్జించి యున్నాడు
స్వంతమని అందుకొనుడి
మీ ఆత్మకు శాంతి జెందనీయుడి

విజయ జీవనము మనదే
క్రీస్తిచ్చిన - విజయ జీవనము మనదే
విజయ జీవనము మనదే - విశ్వమంతయు మనదె
భజన సంఘంబు మనదే
దేవుండున్న పరలోకమెల్ల మనదే

349. Prardhana Vinedi Pavanuda Prardhana Maku Nerpumaya

ప్రార్థన వినెడి పావనుడా
ప్రార్థన మాకు నేర్పుమయా                ||ప్రార్థన||

శ్రేష్ఠమైన భావము గూర్చి
శిష్య బృందముకు నేర్పితివి
పరముడ నిను ప్రణుతించెద ప్రియముగ
పరలోక ప్రార్థన నేర్పుమయా            ||ప్రార్థన||

పరమ దేవుడవని తెలిసి
కరము లెత్తి జంటగా మోడ్చి
శిరమునువంచి సరిగను వేడిన
సుంకరి ప్రార్థన నేర్పుమయా           ||ప్రార్థన||

దినములోన చేసిన సేవ
దైవ చిత్తముకు సరిపోవ
దీనుడవయ్యు ఒంటిగ కొండపై
చేసిన ప్రార్థన నేర్పుమయా           ||ప్రార్థన||

శ్రమలు యేసువా చుట్టుకొని
శత్రుమూక నిను పట్టగను 
శాంతముతో శరణని వేడిన
గెత్సెమనె ప్రార్ధన నేర్పుమయా   ||ప్రార్థన||

348. Deva Devuni Morkkalendi O Priyulara Deva Rajuni Golva Randi

దేవ దేవుని మ్రొక్కలెండి
ఓ ప్రియులారా దేవరాజుని గొల్వరండి
లేవంగానే తర్వగా దేవుని స్మరియించి
ఆ వెనుక మీ పనులు ఆరంభించుట మేలు || దేవ ||

మంచము దిగగానె మొదట
మోకాళ్ళూని మనతండ్రిని తలంచుకొనుట
మంచి పనులన్నిటిన్ మించిన పని యౌను
కొంచమైనను బద్దకించుట సరికాదు || దేవ ||

అన్నము తినుటకు ముందు
వందనములు ఆచరించుట గొప్ప విందు
అన్ని దేవుడు మీకు అందించునని నమ్ము
కొన్న యెడల అందుకొందురానందముతో || దేవ ||

పయనమై ప్రార్ధించుకొండి
దేవుడు మిమ్ము పదిలమ్ముగా నడుపునండి
భయము కల్గదు మీ బాట చదునైయుండు
రయముగా వెళ్ళుదురు రంజిల్లు మీ మనస్సు || దేవ ||

ఆపదలో ప్రార్ధించుకొండి అది తప్పును
అపుడాయనను స్తుతించండి
మీపైన దేవునికి మెండైన ప్రేమయని
ఈ పనిలో మీరు గ్రహించు కొనవలయును || దేవ ||

ఇబ్బందిలో ప్రార్ధించండి అది తీరును
ఎంతో సంతుష్టి పొందండి
జబ్బులో ప్రార్ధించి స్వస్థత నొందండి
అబ్బును దేవుని ఆశ్రయించెడి వాలు || దేవ ||

దేవుడే మన మానవుఁడై
యేసుక్రీస్తుగా వెలసి తిరిగెనీ యిలపై
చావొంది చావును చంపి జీవించెను
కావున మనకు మోక్షంబు నమ్మిన యెడల || దేవ ||

ఎన్ని తిరిగిన పోవు పోవు పాపంబులు
ఎంత ఏడ్చిన పోవు పోవు
ఎన్నాళ్ళు పుణ్యక్రియ లెన్నిచేసిన పోవు
అన్ని చేసిన క్రీస్తునందు నమ్మిన గాని || దేవ ||

347. Jaya Vijayamani Padudama Jaya Vijayaudagu Yesunaku

జయ విజయమని పాడుదమా
జయ విజయుడగు యేసునకు
అపజయమెరుగని దేవునకు
జయస్తోత్రం స్తుతి చేయుదమా

ఇహామందు పలు ఆపదలు ఎన్నో కలిగినను
నా హస్తములు పట్టుకొని వడివడిగా నన్ను నడిపించును

మహా దయాళుడు యెహోవా నన్నిల కరుణించి
నా పాపముల నన్నింటిని మన్నించి మలినము తొలగించున

346. Gethsemane Thotalo Prardhimpa Nerpithiva

గెత్సేమనే తోటలో ప్రార్ధింప నేర్పితివా...
ఆ ప్రార్ధనే మాకునిలా రక్షణను కలిగించెను
ఆ... ఆ.... ఆ... ఆ.... ||గెత్సే||

నీ చిత్తమైతే ఈ గిన్నెను - నా యొద్దనుండి తొలగించుమని
దు:ఖంబుతో భారంబుతో - ప్రార్ధించితివా తండ్రి       ||గెత్సే||

ఆ ప్రార్ధనే మాకునిలా - నిరీక్షణ భాగ్యంబు కలిగించెను
నీ సిలువే మాకు శరణం - నిన్న నేడు రేపు మాపు ||గెత్సే||

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...