ప్రార్థన వినెడి పావనుడా
ప్రార్థన మాకు నేర్పుమయా ||ప్రార్థన||
శ్రేష్ఠమైన భావము గూర్చి
శిష్య బృందముకు నేర్పితివి
పరముడ నిను ప్రణుతించెద ప్రియముగ
పరలోక ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన||
పరమ దేవుడవని తెలిసి
కరము లెత్తి జంటగా మోడ్చి
శిరమునువంచి సరిగను వేడిన
సుంకరి ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన||
దినములోన చేసిన సేవ
దైవ చిత్తముకు సరిపోవ
దీనుడవయ్యు ఒంటిగ కొండపై
చేసిన ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన||
శ్రమలు యేసువా చుట్టుకొని
శత్రుమూక నిను పట్టగను
శాంతముతో శరణని వేడిన
గెత్సెమనె ప్రార్ధన నేర్పుమయా ||ప్రార్థన||
No comments:
Post a Comment