భయపడకు భయపడకు - నీ దేవుడు నీతో ఉన్నాడు జడియకుము జడియకుము - నీ ప్రార్ధన వినుచున్నాడు యేసు దేవుని నమ్మిన వారికి అపజయమెన్నడు కలుగదు ఆ.. ఆ... ఆ... హల్లెలూయా. ఆ.. ఆ... ఆ... హల్లెలూయా. ఆ.. ఆ...ఆ... హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా
426. Devude Nakasryambu Divyamaina Durgamu
దేవుడే నాకాశ్రయంబు – దివ్యమైన దుర్గము
మహా వినోదు డాపదల – సహాయుడై నన్ బ్రోచును
అభయ మభయ మభయ మెప్పు
డానంద మానంద మానంద మౌగ ||దేవుడే||
పర్వతములు కదిలిన నీ – యుర్వి మారు పడినను
సర్వమున్ ఘోషించుచు నీ – సంద్ర ముప్పొంగినన్
అభయ మభయ మభయ మెప్పు
డానంద మానంద మానంద మౌగ ||దేవుడే||
దేవుడెప్డు తోడుగాగ – దేశము వర్ధిల్లును
ఆ తావు నందు ప్రజలు మిగుల – ధన్యులై వసింతురు
అభయ మభయ మభయ మెప్పు
డానంద మానంద మానంద మౌగ ||దేవుడే||
రాజ్యముల్ కంపించిన భూ – రాష్ట్రముల్ ఘోషించిన
పూజ్యుండౌ యెహోవా వైరి – బూని సంహరించును
అభయ మభయ మభయ మెప్పు
డానంద మానంద మానంద మౌగ ||దేవుడే||
విల్లు విరచు నాయన తెగ – బల్లెము నరకు నాయన
చెల్ల చెదర జేసి రిపుల – నెల్లద్రుంచు నాయనే
అభయ మభయ మభయ మెప్పు
డానంద మానంద మానంద మౌగ ||దేవుడే||
పిశాచి పూర్ణ బలము నాతో – బెనుగులాడ జడియును
నశించి శత్రు గణము దేవు – నాజ్ఞ వలన మడియును
అభయ మభయ మభయ మెప్పు
డానంద మానంద మానంద మౌగ ||దేవుడే||
కోటయు నాశ్రయమునై యా – కోబు దేవు డుండగా
ఏటి కింక వెరవ వలయు – నెప్డు నాకు బండుగ
అభయ మభయ మభయ మెప్పు
డానంద మానంద మానంద మౌగ ||దేవుడే||
425. Ee Dinama Sada Na Yesuke Sontham
ఈ దినం సదా నా యేసుకే సొంతం
నా నాధుని ప్రసన్నత నా తోడ నడచును (2)
రానున్న కాలము – కలత నివ్వదు (2)
నా మంచి కాపరీ సదా – నన్ను నడుపును ||ఈ దినం||
ఎడారులు లోయలు ఎదురు నిలచినా
ఎన్నడెవరు నడువని బాటయైనను (2)
వెరవదెన్నడైనను నాదు హృదయము (2)
గాయపడిన యేసుపాదం అందు నడచెను (2) ||ఈ దినం||
ప్రవాహం వోలె శోదకుండు ఎదురు వచ్చినా
యుద్ధకేక నా నోట యేసు నామమే
విరోదమైన ఆయుధాలు యేవి ఫలించవు
యెహోవా నిస్సియే నాదు విజయము ||ఈ దినం||
424. Snehithudu Prana Priyudu Ithade Na Priya Snehithudu
జాడలు వెదకి జాలి చూపెను