పరదేశి నేనిలలో.. నా స్వాస్థ్యము నీవేకదా
నా ధ్యానము నీవయ్యా - నా గానము నీవయ్యా
నా సర్వమా నా యేసయ్యా..
ఒంటరినై నేనుండగా
నన్ను కోట్లాది జనముగా మార్చెదవు
బలహీనుడనై నేనుండగా
బలమైన వానిగా నను మార్చెదవు
నా జనము నీవయ్యా నా బలము నీవయ్యా
నాకున్నవన్నీ నీవేనయ్యా
శుభవార్తను ఇల నే చాటగ
నాకై జీవ కిరీటము దాచితివే
విశ్వాసములో నే సడలిపోకుండ
అంతము వరకు నను కాపాడుమా
నా జీవము నీవయ్యా నా మార్గము నీవయ్యా
నా జీవకిరీటం నీవేనయ్యా
లోకాశలు నన్ను వెంటాడిన
నిత్యం నా ఆశ నీవేనయ్యా
ఈ లోకములో ఏ సంపదా
అక్కర లేదయ్యా నీవుండగా
నా ఆశ నీవయ్యా నా శ్వాస నీవయ్యా
నాకున్న ఆస్తి నీవేనయ్యా