నేనును నా యింటివారును
నీతిసూర్యుని గొలుతుము
దీన మనసుని గలిగి దేవుని
దివ్య సేవను జేతుము
అనుదినంబును ప్రభుని దలచుచు
అలయకను ప్రార్ధింతుము
అవనరత మా ప్రభుని చిత్తము
ననుకరింతుము పనులలో
వేదవాక్య పఠనమందున
విసుగుజెందక నుందుము
ఆదరంబును దైవచిత్తము
ననుసరించుచు నడుతుము
ఆశతోడను ప్రభుని దినమును
నాచరింతుము మరువక
విసుగు జెందక నాలయమునక
ు
సిన్న పెద్దల దెత్తుము
సంఘ కార్యక్రమములందు
సహకరింతుము ప్రీతితో
భంగపరచెడి పనులనన్ని
కృంగదీసెదమనిశము
ప్రేమతోడను పొరుగువారిని
ప్రియులుగను భావింతుము
క్షమయు స్నేహము నేర్చి
ప్రభుకడ శాంతితో జీవింతుము
శక్తికొలది శరీర బలమును
శ్రమను క్రీస్తుకు నిత్తుము
భక్తితో హృదయమును పూర్తిగ
ప్రభునికే యర్పింతుము
చిన్నవారలు దైవరాజ్యపు
వారసులంచును
అన్నివేళల వారి వృద్ధికి
మిన్నగ దోడ్పడెదము
పెద్దవారలు దైవజనులని
పేర్మితో భావింతుము
శుద్ధుడగు ప్రభు క్రీస్తు మనసును
శ్రద్ధ తోడను జూపుచు
జీవితంబున ప్రభుని
ప్రేమాశీస్సులను ప్రసరింతుము
దివ్యజ్యోతుల రీతి వెలుగుచు
దివ్య సన్నిధి నుందుము
No comments:
Post a Comment