మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా
మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా
నా మది నీ కోవెలగా మలచుకోవయా
నా హృదిని రారాజుగా నిలిచిపోవయా
హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము
దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము
మనసు మర్మమెరిగిన మహనీయుడా
మనసు మార్చగలిగిన నిజదేవుడా ||నా మది||
చంచల మనస్సాడించు బ్రతుకు ఆటను
వంచన చేసి నడుపును తప్పు బాటను
అంతరంగమును పరిశీలించు యేసయ్యా
స్థిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా ||నా మది||
నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి
దీనమనస్సుతో నీకడ శిరము వంచితి
పూర్ణశాంతి గలవానిగ నన్ను మార్చుమా
తరతరములకు క్షేమము చేకూర్చుమా ||నా మది||