Wednesday, 28 March 2018

459. Ma Ganam Ma Dhyanam Nikorake Swami

మాగానం మాధ్యానం నీకొరకే స్వామి
మా హృదయం మా సర్వం
నిను గొలుచుటకే స్వామి

పరలోకపు రాజా మా
మహిమాన్విత తేజ
ధర నరులను రక్షించుటకొచ్చిన
వరరూపుడవు నీవు

ప్రేమకు ప్రతిరూపం నీవు
ప్రతిపాపికి దీపం నీవు
ప్రపంచ భాగ్యవిధాతవు నీవు
ధరలో మరణ విజేతవు నీవు

458. Manasunna Manchideva Ni Manasunu Nakichava

మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా
మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా
నా మది నీ కోవెలగా మలచుకోవయా
నా హృదిని రారాజుగా నిలిచిపోవయా

హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము
దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము
మనసు మర్మమెరిగిన మహనీయుడా
మనసు మార్చగలిగిన నిజదేవుడా ||నా మది||

చంచల మనస్సాడించు బ్రతుకు ఆటను
వంచన చేసి నడుపును తప్పు బాటను
అంతరంగమును పరిశీలించు యేసయ్యా
స్థిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా ||నా మది||

నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి
దీనమనస్సుతో నీకడ శిరము వంచితి
పూర్ణశాంతి గలవానిగ నన్ను మార్చుమా
తరతరములకు క్షేమము చేకూర్చుమా ||నా మది||

457. Paravasini Ne Jagamuna Prabhuva

పరవాసిని నే జగమున ప్రభువా (2)
నడచుచున్నాను నీ దారిన్
నా గురి నీవే నా ప్రభువా (2)
నీ దరినే జేరెదను
నేను.. నీ దరినే జేరెదను            ||పరవాసిని||     
లోకమంతా నాదని యెంచి
బంధు మిత్రులే ప్రియులనుకొంటిని (2)
అంతయు మోసమేగా (2)
వ్యర్ధము సర్వము
ఇలలో.. వ్యర్ధము సర్వమును         ||పరవాసిని||
ధన సంపదలు గౌరవములు
దహించిపోవు నీలోకమున (2)
పాపము నిండె జగములో (2)
శాపము చేకూర్చుకొనే
లోకము.. శాపము చేకూర్చుకొనే     ||పరవాసిని||
తెలుపుము నా అంతము నాకు
తెలుపుము నా ఆయువు యెంతో (2)
తెలుపుము ఎంత అల్పుడనో (2)
విరిగి నలిగియున్నాను
నేను.. విరిగి నలిగియున్నాను       ||పరవాసిని||
ఆ దినము ప్రభు గుర్తెరిగితిని
నీ రక్తముచే మార్చబడితిని (2)
క్షమాపణ పొందితివనగా (2)
మహానందము కలిగే
నాలో.. మహానందము కలిగే         ||పరవాసిని|| 
యాత్రికుడనై ఈ లోకములో
సిలువ మోయుచు సాగెదనిలలో (2)
అమూల్యమైన ధనముగా (2)
పొందితిని నేను
యేసునే.. పొందితిని నేను           ||పరవాసిని||   
నా నేత్రములు మూయబడగా
నాదు యాత్ర ముగియునిలలో (2)
చేరుదున్ పరలోక దేశము (2)
నాదు గానము ఇదియే
నిత్యము.. నాదు గానము ఇదియే ||పరవాసిని|| 

456. Paradesi Ne Nilalo Na Swasthyamu Nive Kada

పరదేశి నేనిలలో.. నా స్వాస్థ్యము నీవేకదా
నా ధ్యానము నీవయ్యా - నా గానము నీవయ్యా
నా సర్వమా నా యేసయ్యా..

ఒంటరినై నేనుండగా
నన్ను కోట్లాది జనముగా మార్చెదవు
బలహీనుడనై నేనుండగా
బలమైన వానిగా నను మార్చెదవు
నా జనము నీవయ్యా నా బలము నీవయ్యా
నాకున్నవన్నీ నీవేనయ్యా

శుభవార్తను ఇల నే చాటగ
నాకై జీవ కిరీటము దాచితివే
విశ్వాసములో నే సడలిపోకుండ
అంతము వరకు నను కాపాడుమా
నా జీవము నీవయ్యా నా మార్గము నీవయ్యా
నా జీవకిరీటం నీవేనయ్యా

లోకాశలు నన్ను వెంటాడిన
నిత్యం నా ఆశ నీవేనయ్యా
ఈ లోకములో ఏ సంపదా
అక్కర లేదయ్యా నీవుండగా
నా ఆశ నీవయ్యా నా శ్వాస నీవయ్యా
నాకున్న ఆస్తి నీవేనయ్యా

455. Nenunu Na Inti Varunu Nithi Suryuni Goluthumu

నేనును నా యింటివారును
నీతిసూర్యుని గొలుతుము
దీన మనసుని గలిగి దేవుని
దివ్య సేవను జేతుము

అనుదినంబును ప్రభుని దలచుచు
అలయకను ప్రార్ధింతుము
అవనరత మా ప్రభుని చిత్తము
ననుకరింతుము పనులలో

వేదవాక్య పఠనమందున
విసుగుజెందక నుందుము
ఆదరంబును దైవచిత్తము
ననుసరించుచు నడుతుము

ఆశతోడను ప్రభుని దినమును
నాచరింతుము మరువక
విసుగు జెందక నాలయమునక
ు సిన్న పెద్దల దెత్తుము

సంఘ కార్యక్రమములందు
సహకరింతుము ప్రీతితో
భంగపరచెడి పనులనన్ని
కృంగదీసెదమనిశము

ప్రేమతోడను పొరుగువారిని
ప్రియులుగను భావింతుము
క్షమయు స్నేహము నేర్చి
ప్రభుకడ శాంతితో జీవింతుము

శక్తికొలది శరీర బలమును
శ్రమను క్రీస్తుకు నిత్తుము
భక్తితో హృదయమును పూర్తిగ
ప్రభునికే యర్పింతుము

చిన్నవారలు దైవరాజ్యపు
వారసులంచును
అన్నివేళల వారి వృద్ధికి
మిన్నగ దోడ్పడెదము

పెద్దవారలు దైవజనులని
పేర్మితో భావింతుము
శుద్ధుడగు ప్రభు క్రీస్తు మనసును
శ్రద్ధ తోడను జూపుచు

జీవితంబున ప్రభుని
ప్రేమాశీస్సులను ప్రసరింతుము
దివ్యజ్యోతుల రీతి వెలుగుచు
దివ్య సన్నిధి నుందుము

454. Nenu Nivadanai Yundagoredan Yesu Priya Rakshaka

నేను నీ వాడనై యుండగోరెదన్ - యేసు ప్రియ రక్షకా
నీవు చూపు ప్రేమను గాంచితిన్ - నన్ను జేర్చు నీ దరిన్
నన్ను జేర్చు చేర్చు చేర్చు రక్షకా నీవు పడ్డ సిల్వకున్
నన్ను జేర్చు చేర్చు చేర్చు రక్షకా గాయపడ్డ ప్రక్కకున్

నన్ను బ్రతిష్ఠపర్చుమీ నాధా - నీదు కృపవల్లనే
నాదు నాత్మ నిరీక్షించు - నీ చిత్తంబు నాదగున్ ||నన్ను||

నీదు సన్నిధిలో నిఁక నుండ - నెంత తుష్టి నాకగున్
స్నేహితునిగ మాటలాడెదన్ - సర్వశక్త ప్రభుతో ||నన్ను||

నీదు దివ్య ప్రేమాతిశయము - ఇహబుద్ధి కందదు
పరమందున దాని శ్రేష్ఠత - నేనభవించెదన్ ||నన్ను||

453. Ne Sageda Yesunitho Na Jivitha Kalamantha

నే సాగెద యేసునితో
నా జీవిత కాలమంతా (2)
యేసుతో గడిపెద యేసుతో నడిచెద (2)
పరమును చేరగ నే వెళ్లెద (2)
హనోకు వలె సాగెదా           
వెనుక శత్రువులు వెంటాడిననూ (2)
ముందు సముద్రము ఎదురొచ్చినా (2)
మోషె వలె సాగెదా             
లోకపు శ్రమలు నన్నెదిరించినా (2)
కఠినులు రాళ్ళతో హింసించినా (2)
స్తెఫను వలె సాగెదా            
బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే (2)
క్రీస్తుకై హత సాక్షిగా మారిన (2)
పౌలు వలె సాగెదా           
తల్లి మరచిన తండ్రి విడచిన (2)
బంధువులే నన్ను వెలివేసినా (2)
బలవంతుని వలె సాగెదా 

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...